మహేష్ కి 50 కోట్లు అనిల్ కి 10 కోట్లు అయితే సినిమా బడ్జెట్ ఎంత  

మహేష్ సినిమా కోసం భారీగా డిమాండ్ చేస్తున్న అనిల్ రావిపూడి.

Direcctor Anill Ravipudi Demand Huge Remuneration For Mahesh Babu Movie-dil Raju,direcctor Anill Ravipudi,mahesh Babu Movie,telugu Cinema,tollywood

సూపర్ స్టార్ మహేశ్ బాబు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని క్రేజీ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయడానికి డిసైడ్ అయిన సంగతి తెలిసిందే. మహర్షి సినిమా రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకోవడంతో అనిల్ సినిమాని వీలైనంత వేగంగా పట్టాలు ఎక్కించే పనిలో మహేష్ బాబు ఉన్నాడని టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమా దూకుడు స్టైల్ లలో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా అనిల్ ఆవిష్కరిస్తున్నాడు అనే మాట ఇండస్ట్రీలో వినిపిస్తుంది..

మహేష్ కి 50 కోట్లు అనిల్ కి 10 కోట్లు అయితే సినిమా బడ్జెట్ ఎంత-Direcctor Anill Ravipudi Demand Huge Remuneration For Mahesh Babu Movie

ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం ఇప్పుడు మహేష్ బాబు, అనిల్ రావిపూడి తీసుకుంటున్న రెమ్యునరేషన్ టాలీవుడ్ లో సంచలనంగా మారింది. వరుస్ హిట్ లతో టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా ఉన్న మహేష్ బాబు రెమ్యునరేషన్ ఏకంగా ఎబ్భై కోట్లు వరకు ఉందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా కోసం దర్శకుడు అనిల్ 10 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. ఇక వీరిద్దరి రెమ్యునరేషన్ ఏకంగా 60 కోట్లు వరకు ఉంటే ఇక సినిమా ఇతర కాస్టింగ్, టెక్నికల్ బడ్జెట్ కలుపుకుంటే ఏకంగా వంద కోట్లు దాటిపోతుంది. అయితే మహేష్ మార్కెట్ వంద కోట్లు దాటినా కూడా ఆ స్థాయిలో బడ్జెట్ అంటే ఒకరికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిందే అని టాలీవుడ్ లో చర్చించుకుంటున్నారు.