మళ్ళీ భూమ్మీద జన్మించిన డైనోసర్లు!

భూమి మీద అతిపెద్ద ప్రాణులుగా గుర్తింపు పొంది, చాలాకాలం కిందటే అంతరించిపోయిన డైనోసార్ల గురించి రోజాకు కొత్త విషయం బయటపడుతుంది.66 మిలియన్ సంవత్సరాల క్రితం గ్రహశకలం భూమిని ఢీకొట్టినప్పుడు భూకంపాలు, సునామీలు, కార్చిచ్చులు ఏర్పడ్డాయి.అనంతరం చెలరేగిన ధూళి సూర్యుడిని కనిపించనీయకుండా చేసి దశాబ్దాల పాటు భూమిని కటిక చీకట్లోకి నెట్టింది.దాంతో డైనోసార్లు అంతరించిపోయాయని చాలామంది చెబుతుంటారు.

 Dinosaurs Born On Earth Again , Dianoseds, Born, Earth, Viral Latest, Viral News-TeluguStop.com

అయితే.ఉన్నట్టుండి డైనోసర్ లు మళ్ళీ భూమ్మీదకు వచ్చాయనే వార్తలు వినిపిస్తున్నాయి.? అవును నిజంగానే భూమిపై డైనోసర్ పిల్లలు సంచరిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.అందులో డైనోసర్లు మాదిరిగానే ఉన్న జంతువులను చూసి నెటిజన్లు ఆశ్చర్యానికి గురౌతున్నారు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో డైనోసర్లను పోలిన జంతువుల గుంపు సముద్రం ఒడ్డున వరుసగా పరుగెత్తడం కనిపిస్తుంది.ఐతే ఇవి డైనోసర్ల కంటే కూడా చాలా చిన్న సైజులో ఉంటడం గమనార్హం.

దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.వీటిని చూస్తే నిజంగానే భూమిపై మళ్లీ డైనోసర్ల జాతి ప్రస్థానం మళ్ళీ మొదలైందా అనేంత ఆశ్యర్యం కలుగుతోంది.

తాజాగా సెంధ్వా జిల్లాలోని వర్ల గ్రామంలో శాస్త్రవేత్తలు సైతం డైనోసార్ గుడ్లను కనుగొన్న విషయాన్నీ మనం చూసాం.

నిజానికి డైనోసార్లలో చాలా రకాలు ఉంటాయని, వీటిలో పొడవాటి మెడ గల డైనోసార్లు కూడా ఉన్నాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

వాటిని మామెంచిసారస్ డైనోసార్ అని అంటారట.ఐతే అచ్చం డైనోసార్లలా కనిపించే ఈ వింత జీవులు భూమిపైకి ఎలా వచ్చాయో, ఎక్కడి నుంచి వచ్చాయో తెలియక అంతా నోరెళ్ల బెడుతున్నారు.

అంతేకాకుండా అసలిది ఏ విధమైన జంతువు అనేది ఇంకా తెలియరాలేదు.కాగా, ఒకప్పుడు ఇలానే చైనాలో ఓ డైనోసర్ వీడియో వైరల్ అయిన సంగతి మనకు తెలిసిందే.

క్లోనింగ్ పద్దతిలో వీటిని పుట్టించారనే వార్తలు కూడా అప్పట్లో చక్కర్లు కొట్టాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube