డైనోసార్ గుడ్లను మీరు ఎప్పుడైనా చూశారా ?  

Dinosaur Eggs, Tamilnadu, Perambalur, Geology and Archeology Experts, Dinosaur Eggs In Social Media, One Dinosaur Eggs 200 Kgs, Ammonoids - Telugu Ammonoids, Dinosaur Eggs, Dinosaur Eggs Found In Perambalur Tamilnadu, Dinosaur Eggs In Social Media, Geology And Archeology Experts, One Dinosaur Eggs 200 Kgs, Perambalur, Tamilnadu

సాధారణంగా ఎన్నో మిస్టరీ వార్తలు వైరల్ అవుతుంటాయ్.ఇక అలానే ఇప్పుడు కూడా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

TeluguStop.com - Dinosaur Eggs Tamilnadu Perambalur

ఆ వార్త చూస్తే ఎవరైనా సరే షాక్ అయిపోతారు.ఎందుకంటే? అవి మనం చూడనివి.మన తల్లితండ్రులు చూడనివి.జస్ట్ ఊహలు మాత్రమే! డైనోసార్లు ఒకప్పుడు ఉండేవి అని అవి అంతరించిపోయాయి అని చెప్పేవాళ్లు.అయితే ఇప్పుడు మాత్రం డైనోసార్ గుడ్లు అంటూ తెర మీదకు వచ్చాయ్.

ఆ గుడ్లు నిజంగా డైనోసార్ గుడ్ల లేదా అనే విషయం తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయ్.

TeluguStop.com - డైనోసార్ గుడ్లను మీరు ఎప్పుడైనా చూశారా -General-Telugu-Telugu Tollywood Photo Image

తమిళనాడులోని పెరంబలూర్‌లో ”డైనోసార్‌ గుడ్ల” రూపంలో ఉండే అవశేషాలు బయటపడ్డాయ్.కున్నా జిల్లాలోని ఓ నీటి ట్యాంక్ కోసం తవ్వకాలు జరపగా అక్కడి స్థానికులు బంతి ఆకృతిలో ఉన్న 25 భారీ పురాతన వస్తువులు ఉండటం గమనించారు.

ఇక అంతే.వాటిని తీసి సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా.అవి డైనోసార్ గుడ్లు అంటూ ప్రచారం మొదలెట్టారు.

ఈ విషయం తెలుసుకున్న భూగర్భ, పురావస్తు శాఖల నిపుణుల బృందం వెంటనే స్థానిక స్థలానికి చేరుకొని పరిశీలించగా సంచలన విషయాలు బయటపడ్డాయ్.

వాటిని పరిశీలించిన నిపుణుల బృందం అవి డైనోసార్ గుడ్లు కాదని అమ్మోనైట్‌ అవక్షేపాలు అని నిర్దారించారు.ఇక వాటి ఒక్కో దాని బరువు ఏకంగా 200 కిలోలు ఉంటుందని వారు తెలిపారు.

అయితే అవి 416 సంవత్సరాల క్రితమే డెవోనియన్‌ కాలంలో ఏర్పడిన విభిన్న సముద్ర జాతుల సమూహం అని దాన్నే అమ్మోనాయిడ్లని అంటారని తేల్చారు! వీటిని డైనోసార్ గుడ్లు అనుకోని తప్పు ప్రచారం చేస్తున్నారని.ప్రస్తుతం తమిళనాడులో ఉన్న అరియలూరు, పెరంబలూర్‌ ఒకప్పుడు సముద్ర గర్భంలో ఉండేవని వాటిని డైనోసార్ గుడ్లు అనుకోని తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు నిపుణులు వెల్లడించారు.

#Dinosaur Eggs #Perambalur #Ammonoids #GeologyAnd #DinosaurEggs

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Dinosaur Eggs Tamilnadu Perambalur Related Telugu News,Photos/Pics,Images..