సరికొత్త రికార్డు సృష్టించబోతున్న దినేష్ కార్తిక్.. ఏ విషయంలో నంటే?

భారత జాతీయ క్రీడ హాకీ అయినప్పటికీ ఎక్కువ మంది జనం క్రికెట్ ఇష్టపడుతుండటం మనం చూడొచ్చు.క్రికెట్ మ్యాచ్ టెలికాస్ట్ అవుతుందంటే చాలు.

 Dinesh Karthik Is Going To Create A New Record .. In What Cas Dinesh Karthik, Cr-TeluguStop.com

టీవీలకు అతుక్కుపోయే వారు బోలెడు మంది ఉంటారు.ఈ క్రమంలోనే భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య 2018 మార్చిలో జరిగిన నిదాహస్ ట్రోఫీ క్రికెట్ అభిమానులందరికీ గుర్తుండే ఉంటుంది.

ఈ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో దినేష్ కార్తిక్ జట్టును గెలిపించేందుకుగాను క్రికెట్ ఆడిన తీరు సూపర్బ్ అని చెప్పొచ్చు.

ఎనిమిది బంతుల్లో 29 రన్స్ తీసి ఇండియాను విజయ తీరానికి చేర్చాడు.

ఇకపోతే లాస్ట్ బాల్‌కు దినేష్ కార్తిక్ కొట్టి ఫ్లాట్ సిక్స్ గురించి క్రికెట్ అభిమానులు ఇప్పటికీ చర్చించుకుంటుంటారు.అది అత్యద్భుతమని అనుకుంటుంటారు.కాగా, ఈ విషయమై దినేష్ కార్తిక్ రికార్డు క్రియేట్ చేయబోతున్నాడు.చివరి సిక్స్ మూమెంట్‌ ప్రతీ ఒక్కరు మళ్లీ ఆస్వాదించేందుకుగాను నాన్ ఫంజిబుల్ టోకెన్ (ఎన్ఎఫ్‌టి) రూపంలో లభించేలా చేస్తున్నారు.

అదే కనుక జరిగినట్లయితే ఇలా ఎన్‌ఎఫ్‌టి క్రియేట్ చేసిన తొలి భారత ప్లేయర్‌గా దినేష్ కార్తిక్ రికార్డు సృష్టించినట్లే.మొత్తంగా భారత్‌ను గెలిపించిన దినేష్ కార్తిక్ విన్నింగ్ మూమెంట్ యానిమేషన్ రూపంలో రానుంది.

Telugu Dineshkarthik, Bangladesh, Cricket, Final, Nidha Trophy, India-Latest New

కార్తిక్‌లోని ఆలోచనలు, ఎమోషనల్ ఫీలింగ్స్ ఈ ఎన్ఎఫ్‌టిలో భద్రపరచనున్నారు.ఈ సందర్భంగా దినేష్ కార్తిక్ మాట్లాడుతూ నిదాహస్ ట్రోఫి ఫైనల్ మ్యాచ్ తన జీవితంలో అత్యుత్తమైన మూమెంట్స్‌లో ఒకటని, ఆ అత్యద్భుతమైన క్షణాలను గ్రాఫికల్ ఎన్ఎఫ్‌టి రూపడం ఆనందంగా ఉందని చెప్పాడు.ఈ ఎన్ఎఫ్‌టి యానిమేషన్‌ను దినేష్ కార్తిక్ రిలేటివ్ స్క్వాష్ ప్లేయర్ సౌరవ్ ఘోషల్ సహకారంతో తీసుకురాబోతున్నారు.దీనిని ఈ నెల 12 నుంచి వేలం వేయబోతున్నట్లు సమాచారం.

ఈ రకంగా దినేష్ కార్తిక్ ఆడిన ఆటను ఎన్ఎఫ్‌టి‌గా మార్చడం పట్ల క్రికెట్ అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube