మంత్రిగారి పనికి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు,ఇంతకీ ఏంచేసారో తెలుసా

తమిళనాడు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి దిండిగల్ శ్రీనివాస్ ఒక గిరిజన బాలుడి చేత చెప్పులు తీయించుకున్న ఘటన దుమారం రేపింది.శ్రీనివాసన్ ఉన్నతాధికారులు,పలువురు ప్రజా ప్రతినిధులతో కలిసి ముదుమలై నేషనల్ పార్క్ సందర్శనార్ధం వెళ్లారు.

 Dindigul Srinivasan Remove His Slippers-TeluguStop.com

అయితే ఆసమయంలో ఆయన చెప్పులో ఏదో ఇరుక్కున్నట్లు అవ్వడం తో చుట్టూ సెక్యురితా సిబ్బంది ఉన్నప్పటికీ ఎదురుగా ఉన్న ఒక గిరిజన బాలుడిని దగ్గరకు పిలిపించి మరి తన చెప్పులను విప్పించారు.అయితే ఆ సమయంలో ఫోటోలు ,వీడియో లు తీయడం పై నిరాకరించడమే కాకుండా ఆ సన్నివేశం వీడియో లో పడకుండా ఉండడానికి అక్కడే ఉన్న ఆయన అనుచరుడు ఒకతను అడ్డం నుంచున్నాడు.

అయితే ఈ వీడియో కాస్త సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం తో ఇప్పుడు ఆ వీడియో చూసిన నెటిజన్లు అందరూ కూడా మంత్రిగారిపై మండిపడుతున్నారు.మంత్రి అయి ఉండి ఇలా ఓ బాలుడితో చెప్పులు తీయించుకోవడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Remove Slippers, Telugu Ups-General-Telugu

తమిళనాడు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి దిండిగల్ శ్రీనివాసన్.నీలగిరి జిల్లా పర్యటనకు వెళ్లారు.అక్కడ ముదుమలై టైగర్ రిజర్వ్‌లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి వెళ్లారు.పర్యటనలో భాగంగా ఓ ఆలయ సందర్శనకు వెళ్లాల్సి రావడంతో అక్కడే ఉన్న ఓ బాలుడిని పిలిచి చెప్పులకు ఉన్న బెల్టును విప్పించుకున్నారు.

ఆ దృశ్యాలు కెమెరా కళ్లకు చిక్కకుండా ఓ వ్యక్తి మంత్రి గారికి అడ్డంగా నిల్చోవడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube