తమిళ సినిమాలపై ఆసక్తి చూపిస్తున్న గద్దలకొండ ఐటెం భామ  

dimple hayati concentrate on Kollywood, Tollywood, Telugu heroines, South Cinema, Indian cinema - Telugu Dimple Hayati Concentrate On Kollywood, Indian Cinema, South Cinema, Telugu Heroines, Tollywood

తెలుగు సినిమాలలో తెలుగు భామలకు అంతగా ప్రాధాన్యత లభించదు.ఈ చాలా కాలంగా అందాల భామలు ఈ విషయంలో టాలీవుడ్ దర్శక, నిర్మాతలపై తమ అసహనం ప్రదర్శిస్తున్నారు.

 Dimple Hayati Tamil Movies Gaddala Konda Ganesh

అందాల ప్రదర్శనకి కూడా సిద్ధంగా ఉండే భామలకు కూడా టాలీవుడ్ దర్శకులు ప్రాధాన్యత ఇవ్వడం లేదు.పరభాష భామలని తీసుకొచ్చి కోట్ల రూపాయిలు రెమ్యునరేషన్ లు ఇస్తున్నారు తప్ప తెలుగులో అందంతో పాటు అభినయం ఉన్న హీరోయిన్స్ చాలా మంది ఉన్న ప్రోత్సాహం లేదు.

దీంతో హీరోయిన్స్ అవ్వాలని అనుకునే తెలుగు అమ్మాయిలు అయితే కోలీవుడ్ కి వలస పోతున్నారు.లేదంటే సినిమాల నుంచి తప్పుకొని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతునానరు.

తమిళ సినిమాలపై ఆసక్తి చూపిస్తున్న గద్దలకొండ ఐటెం భామ-Movie-Telugu Tollywood Photo Image

ఇప్పుడు అలా మరో తెలుగు అందం కోలీవుడ్ వైపు దృష్టి పెట్టింది.దానికి ఇక్కడ అవకాశాలు రాకపోవడమే కారణం అని తెలుస్తుంది.

గద్దలకొండ గణేష్ సినిమాలో ఐటెం సాంగ్ చేసిన భామ అంటే వెంటనే అందరూ గుర్తు పడతారు.ఈ భామ పేరు డింపుల్ హయాతి అచ్చ తెలుగు హైదరాబాదీ అందం.

ఈ బ్యూటీ 2017లో గల్ఫ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది.ఆ సినిమాకి పేరొచ్చినా అందులో నటులకు మాత్రం గుర్తింపు రాలేదు.

ఆ సినిమా తర్వాత యురేకా అనే ఓ చిన్న సినిమాలో హీరోయిన్ గా నటించింది.ఆ సినిమా కూడా ఆశించిన పేరు తీసుకురాలేదు.

ఇక ఈ అమ్మడు గతేడాది హరీష్ శంకర్ రూపొందించిన గద్దలకొండ గణేష్ సినిమాలోని ఐటెం సాంగ్ లో ఆడిపాడింది.ఈ పాటతో అందరి దృష్టిని ఆకర్షించిన కూడా డింపుల్ ని హీరోయిన్ గా తీసుకోవడానికి తెలుగు దర్శకులు అంతగా ఆసక్తి చూపించడం లేదు.

ప్రతి ఒక్కరు మళ్ళీ ఐటెం సాంగ్స్ చేయమని ఆఫర్స్ ఇస్తూ ఉండటంతో ఇక లాభం లేదని కోలీవుడ్ వైపు అడుగులేస్తుంది.తమిళం నుండైతే మంచి ఆఫర్లు వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేస్తోంది.

చిన్నప్పటి నుండి మంచి నటిగా పేరు పొందాలని ఇండస్ట్రీకి వచ్చాను.ఇక్కడేమో గ్లామర్ రోల్స్ మాత్రమే ఆఫర్ చేస్తున్నారు.

అందుకే కోలీవుడ్ కథలు వింటున్న అని చెప్పింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Dimple Hayati Tamil Movies Gaddala Konda Ganesh Related Telugu News,Photos/Pics,Images..