ఆ సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకున్న తెలుగు అందం !

సినీ ఇండస్ట్రీలో టాలెంట్ ఎంత ముఖ్యమో లక్ కూడా అంతే ముఖ్యమనే చెప్పాలి.అందం, అభినయం ఉన్న కూడా కొంతమందికి అదృష్టం ఉండదు.

 Dimple Hayathi Hopes On Ravi Teja Khiladi Movie, Dimple Hayathi, Khiladi, Ravi T-TeluguStop.com

కొంతమంది ఇండస్ట్రీలోకి రావడం తోనే మంచి హిట్ సాధించి స్టార్ స్టేటస్ అందుకుంటారు.కానీ మరికొంత మంది సరైన హిట్ పడక సతమతమవుతూ ఉంటారు.

అలంటి వారిలో యంగ్ బ్యూటీ దింపుల్ హయతి ఒకరు.

దింపుల్ హయతి ఇండస్ట్రీ కి వచ్చి దాదాపు నాలుగు సంవత్సరాలు అవుతున్న ఒక్క హిట్ అంటూ ఎదురు చూస్తుంది.

గల్ఫ్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది ఈ బ్యూటీ.ఈ సినిమా ఆమెకు గుర్తింపు తెచ్చి పెట్టలేదు.ఆ తర్వాత వచ్చిన యురేకా సినిమా కూడా బోల్తా కొట్టింది.ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గద్దల కొండ గణేష్ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో నర్తించింది.

Telugu Dimple Hayathi, Dimplehayathi, Khiladi, Ravi Teja, Telugu Actress, Tollyw

ఈ పాటలో తన అందచందాలతో ఒక్కసారిగా ఇండస్ట్రీ ద్రుష్టి పడేలా చేసుకుంది ఈ తెలుగు ముద్దుగుమ్మ.ఈ సినిమా తర్వాత చాలా గ్యాప్ వచ్చిన మంచి అవకాశంతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యింది.ఈ బ్యూటీ మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న ఖిలాడీ సినిమాలో అవకాశం దక్కించుకుంది.ఈ సినిమా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ఈ సినిమా తో టాలీవుడ్ లో ఎలాగైనా నిరూపించు కోవాలని తహతహ లాడుతుంది.

ఈ బ్యూటీ కెరీర్ కు ఈ సినిమా హిట్ అవ్వడం చాలా అవసరం.

అందుకే ఈ అమ్మడు ఈ సినిమా పైనే తన ఆశలన్నీ పెట్టుకుంది.ఈ సినిమా హిట్ అయితే మరిన్ని అవకాశాలు వరించే అవకాశం ఉంది.

ఇప్పటికే ఈ బ్యూటీ కి రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కూడా ఒక పాత్రలో చేస్తుందని వార్తలు వచ్చాయి.ఈ వార్త నిజమైతే ఈ బ్యూటీ బిజీ హీరోయిన్ గా మారడం ఖాయం గా కనిపిస్తుంది.

చూడాలి మరి రవితేజ ఖిలాడీ ఈ అమ్మడి కెరీర్ కు ఎంత మాత్రం ఉపయోగపడుతుందో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube