తెలుగులో ఎక్కువ సినిమాలు చేసినా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించని హీరోయిన్లలో డింపుల్ హయాతి( Dimple Hayati ) ఒకరు.తెలుగమ్మాయి అయిన డింపుల్ హయాతి గల్ఫ్ అనే సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టారు.
ఖిలాడి సినిమాతో డింపుల్ హయాతికి మంచి గుర్తింపు వచ్చినా ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.రామబాణం సినిమాలో డింపుల్ నటించగా ఈ సినిమా మే నెల 5వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డింపుల్ హయాతి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ప్రముఖ నటి కుష్బూ( Kushboo ) నా సెకండ్ మదర్ అని డింపుల్ తెలిపారు.
విదేశాలకు వెళ్లిన సమయంలో నన్ను కుష్బూ కూతురిలా చూసుకున్నారని డింపుల్ చెప్పుకొచ్చారు.జగపతిబాబు( Jagapathi Babu ) గారి అనుభవాల నుంచి నేను చాలా విషయాలను నేర్చుకున్నానని డింపుల్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
కుష్బూగారు షాపింగ్ సమయంలో చాలా హెల్ప్ చేశారని డింపుల్ అన్నారు.గోపీచంద్ చాలా తక్కువగా మాట్లాడతారని ఆమె కామెంట్లు చేశారు.ఎక్స్ ప్రెషన్ల ద్వారా ఆయన తన మనసులోని భావాలను ఎక్కువగా చెబుతారని ఆమె తెలిపారు. రవితేజ, గోపీచంద్ భిన్నమైన వ్యక్తులు అని ఒకరితో ఒకరికి పోలిక ఉండదని ఆమె చెప్పుకొచ్చారు.
గోపీచంద్ కు కోపం వస్తే కళ్లతో తెలుస్తుందని డింపుల్ అన్నారు.
గోపీచంద్ సపోర్ట్ చేయడం నాకు ఎంతో సంతోషంగా అనిపించిందని డింపుల్ వెల్లడించారు.తెలుగమ్మాయిలకు టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఆఫర్లు వస్తున్నాయని ఆమె కామెంట్లు చేశారు.తెలుగు హీరోయిన్లకు ప్రోత్సాహం లభిస్తోందని మరింత ఛేంజ్ రావాలని కోరుకుంటున్నానని ఆమె కామెంట్లు చేశారు.
నటి కుష్బూ స్పెషల్ కేరింగ్ ను చూపించడంతో డింపుల్ హయాతి కుష్బూను సెకండ్ మదర్ తో పోల్చడం గమనార్హం.