పవన్‌ కళ్యాణ్‌ ‘వకీల్‌సాబ్‌’ విడుదలపై దిల్‌రాజు స్పందన

పవన్‌ కళ్యాణ్‌ 26వ చిత్రం వకీల్‌ సాబ్‌ చిత్రం వచ్చే నెలలో విడుదల కావాల్సి ఉంది.కాని కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా షూటింగ్‌ పూర్తి కాలేదు.

 Dill Raju Comments On Vakeel Sahebh Movie About Release Date, Dill Raju, Pawan K-TeluguStop.com

సరే ఒక నెల లేదా రెండు నెలలో అయినా షూటింగ్‌ పూర్తి చేసి సినిమాను విడుదల చేస్తారనుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కూడా సాధ్యం కాదని తేలిపోయింది.ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కించిన విషయం తెల్సిందే.

ఈ చిత్రం విడుదల విషయంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

తాజాగా నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమాలను విడుదల చేయడం సాధ్యం అయ్యే విషయం కాదు.

రాబోయే రోజుల్లో కూడా సినిమాలు థియేటర్లకు రావాలంటే కష్టాలను ఎదుర్కోవాల్సిందే. పవన్‌తో ప్రస్తుతం తాము నిర్మిస్తున్న వకీల్‌ సాబ్‌ చిత్రం విడుదల విషయమై ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వలేం.

ఈ పరిస్థితి ఇలా ఎంత కాలం ఉంటుందో చెప్పలేం, ఇలా ఎప్పటి వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుందో చెప్పలేని పరిస్థితి.

Telugu Coronavirus, Dill Raju, Lock, Nani, Pawan Kalyan, Theaters, Tollywood-Mov

ఇంతటి విపత్కర పరిస్థితుల్లో సినిమాలను విడుదల చేయడం అనేది ఆత్మహత్య సదృష్యం అవుతుంది.ఎందుకంటే లాక్‌డౌన్‌ ఎత్తివేసిన వెంటనే థియేటర్లు ఓపెన్‌ అయినా కూడా ప్రేక్షకులు ఖచ్చితంగా హాజరు కారు. అందుకే సినిమాలు ఇప్పుడు షూటింగ్‌ కూడా జరుపుకోవడం సాధ్యం కాకపోవచ్చు అంటున్నాడు.

దిల్‌రాజు ‘వి’ సినిమా కూడా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ రెండు సినిమాలను రెండు మూడు వారాల గ్యాప్‌లో వచ్చే ఏడాదిలో విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube