జానుతో పడ్డ రాజు పవన్‌తో అయినా బయట పడేనా?  

Dill Raju Hopes In Pink Movie Remake-dill Raju And Jaanu,dill Raju And Pawan Kalyan,jaanu Positive Tal,pawan Kalyan Pink Movie Remake,tamil 96 Remake Jaanu

తమిళ హిట్‌ మూవీ 96ను చాలా మంది వద్దన్నా కూడా దిల్‌రాజు రీమేక్‌ చేశాడు.సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వచ్చింది.కాని కలెక్షన్స్‌ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు.సినిమాను పాతిక కోట్లకు అమ్మిన దిల్‌రాజు కనీసం 15 కోట్లను కూడా రాబట్టలేక పోయాడు అంటూ సమాచారం అందుతోంది.

Dill Raju Hopes In Pink Movie Remake-Dill And Jaanu Dill Pawan Kalyan Jaanu Positive Tal Pawan Remake Tamil 96

జాను చిత్రం వసూళ్లు చూసి అంతా అవాక్కవుతున్నారు.సూపర్‌ హిట్‌ మనసుకు హత్తుకునే సినిమా అంటూ రివ్యూలు వచ్చాయి.

కాని కలెక్షన్స్‌ మాత్రం దిల్‌రాజు గుండె పట్టుకునేలా ఉన్నాయి.

జాను వల్ల దిల్‌రాజు ఆశలకు గండి పడ్డట్లయ్యింది.జాను సినిమా పక్కన పెడితే ప్రస్తుతం ఈ నిర్మాత పవన్‌ కళ్యాణ్‌తో పింక్‌ రీమేక్‌ చేస్తున్నాడు.ఈ చిత్రంపై కూడా అంచనాలు భారీగా ఉండటం వల్ల దాదాపుగా 75 కోట్లు పెట్టి నిర్మిస్తున్నాడట.

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్‌ చకచక జరుగుతోంది.ఉగాది తర్వాత ఈ చిత్రంను విడుదల చేసే అవకాశం ఉంది.

జాను చిత్రం నిరాశ పర్చడంతో ఈ చిత్రంపై దిల్‌రాజు నమ్మకం పెట్టుకున్నాడు.ఇప్పటి వరకు ఈయన రీమేక్‌ చేసిన సినిమాలు నిరాశ పర్చుతూ వస్తున్నాయి.

కనుక పింక్‌ రీమేక్‌పై కూడా అంచనాలు ఎక్కువగా లేవు.అయినా కూడా నిర్మాత దిల్‌రాజు మాత్రం చాలా నమ్మకంతో పవన్‌ ఉన్నాడనే ధైర్యంతో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్దం అయ్యాడు.

మరి ఈ చిత్రం అయినా దిల్‌రాజును నిలబెట్టేనా చూడాలి.

.

తాజా వార్తలు

Dill Raju Hopes In Pink Movie Remake-dill Raju And Jaanu,dill Raju And Pawan Kalyan,jaanu Positive Tal,pawan Kalyan Pink Movie Remake,tamil 96 Remake Jaanu Related....