యంగ్ దర్శకుడుతో దిల్ రాజు మల్టీ స్టారర్  

dill raju adavi shesh venkat ramji - Telugu Dil Raju, Multi Starer Movie, Telugu Cinema, Tollywood, Young Director

సీతంమవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో టాలీవుడ్ లో ఫస్ట్ టైం పెద్ద మల్టీ స్టారర్ సినిమా తీసిన దిల్ రాజు తన బ్యానర్ లో ఎప్పుడు కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు.ఎవరైనా టాలీవుడ్ లో యంగ్ దర్శకులు హిట్స్ కొడితే వాళ్ళని తన వైపుకి లాక్కుని వారి టాలెంట్ ని ఉపయోగించుకుంటాడు.

TeluguStop.com - Dill Raju Adavi Shesh Venkat Ramji

కమర్షియల్ స్టార్ నిర్మాతగా టాలీవుడ్ లో దూసుకుపోతున్న దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా కూడా కోట్లు గడిస్తున్నాడు.తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమాతో నైజాంలో కలెక్షన్స్ వేట సాగిస్తున్నాడు.

ఇదిలా ఉంటే ఇప్పుడు దిల్ రాజు తన బ్యానర్ లో చాలా కాలం తర్వాత మరో మల్టీ స్టారర్ సినిమా తీయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.

అడవి శేష్ హీరోగా తెరకెక్కిన ఎవరు సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన వెంకట్ రాంజీ అనే యువ దర్శకుడు చెప్పిన కథ దిల్ రాజుకి నచ్చడంతో వెంటనే అతనితో సినిమా చేయడానికి ఒకే చెప్పినట్లు తెలుస్తుంది.

ఇక ఈ సినిమా మల్టీ స్టారర్ గా తెరకెక్కుతుందని సమాచారం.ఇందులో ఒక హీరోగా మెగా హీరో నటిస్తాడని టాక్ వినిపిస్తుంది.త్వరలో ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయని సమాచారం.మరి ఈ సినిమాని దర్శకుడు తన మొదటి సినిమా జోనర్ లో తెరకెక్కిస్తాడా లేక దిల్ రాజు టేస్ట్ కి తగ్గట్లు కమర్షియల్ జోనర్ లో తీస్తాడా అనేది చూడాలి.

#Young Director #Dil Raju

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు