సైలెంట్‌గా వస్తే పర్వాలేదు, కాని ఎవరికి తెలియకుండా వస్తారా ఏంటీ?  

Dill Raju 96 Movie Remake Releasing Date Not Fixed-dill Raju,samantha,sankranthi Releases,sarwanand,summer Releases,tollywood Gossips,vijay Sethupathi

తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన 96 చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు.దిల్‌ రాజు బ్యానర్‌లో ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెల్సిందే.శర్వానంద్‌ మరియు సమంతలు ఈ చిత్రంలో లీడ్‌ రోల్‌లో కనిపించబోతున్నారు.విజయ్‌ సేతుపతి మరియు త్రిషలు జంటగా నటించిన తమిళ 96 చిత్రం సూపర్‌ సెన్షేషనల్‌ సక్సెస్‌ అయ్యింది.అందుకే ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

Dill Raju 96 Movie Remake Releasing Date Not Fixed-dill Raju,samantha,sankranthi Releases,sarwanand,summer Releases,tollywood Gossips,vijay Sethupathi Telugu Tollywood Movie Cinema Film Latest News-Dill Raju 96 Movie Remake Releasing Date Not Fixed-Dill Samantha Sankranthi Releases Sarwanand Summer Tollywood Gossips Vijay Sethupathi

అయితే ఇప్పటి వరకు ఈ సినిమా ఏమైంది అనే విషయమై క్లారిటీ రావడం లేదు.

కొన్ని వారాల క్రితమే సమంత తన పార్ట్‌ షూటింగ్‌ను పూర్తి చేసినట్లుగా ప్రకటించింది.కాని ఇప్పటి వరకు కొత్త అప్‌డేట్‌ లేదు.అసలు సినిమా ఎప్పుడు విడుదల ఉంటుందనే విషయమై క్లారిటీ ఇవ్వడం లేదు.

మొదటగా అనుకున్న ప్రకారం డిసెంబర్‌లో సినిమాను విడుదల చేయాల్సి ఉంది.కాని ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.

వచ్చే ఏడాది జనవరి మొత్తం ఇప్పటికే ఫుల్‌ బుకింగ్‌ అయ్యింది.ఫిబ్రవరిలో కూడా మూడు నాలుగు పెద్ద సినిమాలు విడుదల కాబోతున్నాయి.

మార్చిలో పరీక్షలు ఉంటాయి కనుక విడుదల అవ్వదు.ఏప్రిల్‌ లేదా మే లో ఈ రీమేక్‌ ఉంటుందని తెలుస్తోంది.చిత్ర యూనిట్‌ సభ్యులు చాలా సైలెంట్‌గా రావాలని భావిస్తున్నారు.సైలెంట్‌గా వస్తే పర్వాలేదు కాని ఎవరికి తెలియనంత సైలెంట్‌గా వస్తే మాత్రం వారికే సమస్య అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.