11 ఏళ్లకే పేరెంట్స్ కు దూరం.. నాన్న పట్టించుకోలేదు.. నటుడి ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

దిల్జీత్‌ దోసాంజ్‌.( Diljit Dosanjh ) ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

 Diljit Dosanjh My Connection Parents Broke When I Was 11 Details, Diljit Dosanjh-TeluguStop.com

దిల్జీత్‌ దోసాంజ్‌ కేవలం నటుడిగా మాత్రమే కాకుండా సింగర్( Singer ) కూడా గుర్తింపు తెచ్చుకున్నారు.బడిలో పాఠాలు చదువుకునే రోజుల్లో గురుద్వారలో కీర్తనలు పాడేవాడు దిల్జీత్‌ దోసాంజ్‌.

తర్వాత ఆ గొంతే అతడికి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది.పంజాబీ, హిందీ ఇండస్ట్రీలో సింగర్‌గా, నటుడిగానూ రాణిస్తున్నాడు.

అతడు నటించిన అమర్‌ సింగ్‌ చంకీలా( Amar Singh Chamkila ) సినిమా ఏప్రిల్‌ 12న విడుదల కానుంది.ఈ క్రమంలో ఒక ఇంటర్వ్యూలో తన కష్టాల గురించి చెప్పుకొచ్చారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ.

Telugu Amarsingh, Diljit Dosanjh, Diljitdosanjh-Movie

11 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నన్ను ఇంట్లో నుంచి పంపించేశారు.నా తల్లి దండ్రులను, ఊరిని వదిలేసి మా మామతో లూథియానాకు( Ludhiana ) వెళ్లిపోయాను.అతడు నన్ను తనతో పంపించమని అడగ్గానే అమ్మా నాన్న నాకు మంచి ఫుడ్‌, షెల్టర్‌ దొరుకుతుందన్న ఆశతో వెంటనే తీసుకెళ్లిపోమని చెప్పారు.

వెళ్లడం ఇష్టమేనా? అని నన్ను ఒక్క మాటైనా అడగలేదు.అక్కడికి వెళ్లాక ఒక గదిలో ఒంటరిగా ఉండేవాడిని.

టీవీ ఉండేది కాదు.అప్పుడు ఫోన్లు కూడా లేవు.

అలా నా కుటుంబానికి నేను పూర్తిగా దూరమయ్యాను.నేను ఏ స్కూల్‌లో చదువుతున్నానని కూడా నాన్న అడిగేవారు కాదు.

Telugu Amarsingh, Diljit Dosanjh, Diljitdosanjh-Movie

అందరితో నా సంబంధాలు తెగిపోయాయి.తర్వాత నేను ఫోన్‌ చేసినప్పుడల్లా కాల్‌ కట్‌ చేసేముందు అమ్మ నన్ను ఆశీర్వదించేది.ఎప్పుడూ సంతోషంగా ఉండాలని దీవించగానే అన్ని టెన్షన్లు ఎగిరిపోయేవి.ఎంతో శక్తి వచ్చినట్లు అనిపించేది.తన మాటలతో నాపై ప్రేమవర్షం కురిపించేది.ఆ దేవుడి కంటే కూడా నాకు మా అమ్మే ఎక్కువ అని చెప్పుకొచ్చాడు.

దిల్జిత్‌ ఇటీవల క్య్రూ సినిమాలో కనిపించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube