అమెజాన్‌ చేసిన పనికి అవాక్కయిన దిల్‌ రాజు.. కోట్లు నష్టం  

సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఎఫ్‌ 2’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. అన్ని ఏరియాల్లో కలిపి దాదాపుగా ఈ చిత్రంకు 150 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ వచ్చినట్లుగ తెలుస్తోంది. ఇంత భారీ విజయాన్ని చిత్ర యూనిట్‌ సభ్యులు కూడా ఊహించి ఉండరు. అద్బుతమైన ఎంటర్‌ టైన్‌మెంట్‌ ఉండటంతో ఈ చిత్రంకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఫ్యామిలీ ఆడియన్స్‌ ఇంకా కూడా సినిమాను థియేటర్‌కు వెళ్లి చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. నాలుగు వారాల తర్వాత కూడా రోజుకు 30 నుండి 40 లక్షల వరకు షేర్‌ వస్తున్నట్లుగా తెలుస్తోంది.

Dil Raju Worried About Amazon For F2 Movie-Dil Dil F2 Movie Hero Venkatesh Varun Tej

Dil Raju Worried About Amazon For F2 Movie

ఒక వైపు నిర్మాత దిల్‌రాజుకు కాసుల పంట పండుతున్న నేపథ్యంలో మరో వైపు సినిమాను అమెజాన్‌లో చడీ చప్పుడు లేకుండా పోస్ట్‌ చేశారు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం అమెజాన్‌ ఈ సినిమాను నాలుగు వారాలు పూర్తి అయిన తర్వాత పోస్ట్‌ చేసింది. అయితే ముందుగానే డబ్బులు తీసుకుని అగ్రిమెంట్‌ చేయించుకున్న కారణంగా దిల్‌రాజు అమెజాన్‌ వారిని ఆపే ప్రయత్నం చేయలేదు. దిల్‌రాజు ప్రయత్నం చేసేందుకు కూడా ఛాన్స్‌ లేదు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం అంటూ అమెజాన్‌ మాట వినకపోయేది.

ఎఫ్‌ 2 చిత్రంపై పెద్దగా నమ్మకం లేకనో లేదా మరేంటో కాని నాలుగు వారాల్లోనే సినిమాను అమెజాన్‌లో పోస్ట్‌ చేసేందుకు ముందుగా ఒప్పుకున్నాడు. కాని సినిమా విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో దిల్‌రాజు తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నాడు. ఒక వైపు సినిమా థియేటర్లలో ఉండగానే అమెజాన్‌లో రావడం వల్ల థియేటర్ల ద్వారా వచ్చే లాభం పోయింది. మరో వైపు సినిమా విడుదలకు ముందే తక్కువ రేటుకు అమెజాన్‌కు సినిమాను అమ్మడం జరిగింది. సినిమా సూపర్‌ హిట్‌ టాక్‌ వచ్చిన తర్వాత అమెజాన్‌ వారి వద్ద భారీ ప్రైజ్‌ పెడితే తప్పకుండా వారు కొనుగోలు చేసే వారు.

Dil Raju Worried About Amazon For F2 Movie-Dil Dil F2 Movie Hero Venkatesh Varun Tej

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం కేవలం మూడు కోట్లకు మాత్రమే కొనుగోలు చేశారు. సినిమా విడుదల తర్వాత విజయం సాధించింది కనుక ఖచ్చితంగా ఆరు కోట్లకు పైగా అమ్ముడు పోయేది. మొత్తానికి దిల్‌రాజు ఎఫ్‌ 2 భారీ లాభాలు తెచ్చి పెట్టినా, ఈ విధంగా మాత్రం నష్టం జరిగింది.