పాపం.. రాజ్‌ తరుణ్‌ కెరీర్‌ నాశనం చేసిన దిల్‌రాజు     2018-07-19   11:13:06  IST  Bhanu C

రాజ్‌ తరుణ్‌ హీరోగా దిల్‌రాజు బ్యానర్‌లో తెరకెక్కిన ‘లవర్‌’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఈ చిత్రంపై రాజ్‌ తరుణ్‌ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ‘ఉయ్యాల జంపాలా’ చిత్రం తర్వాత రాజ్‌ తరుణ్‌ మాస్‌ ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్‌ను దక్కించుకున్నాడు. ఆ చిత్రం తర్వాత చేసిన రెండు మూడు సినిమాలు రాజ్‌ తరుణ్‌ను జూనియర్‌ మాస్‌ మహారాజా చేశాయి. దాంతో ఈయనకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. ఏమాత్రం ఆలోచన లేకుండా వచ్చిన ప్రతి సినిమాను ఒప్పేసుకోవడం, చేసేయడంతో ఈయన కెరీర్‌ కష్టాల్లో కూరుకు పోయింది.

చేసిన వరుస చిత్రాలు ఫ్లాప్‌ అవ్వడంతో పాటు, నిర్మాతలకు నష్టాలు వస్తుండటంతో ఈయనతో సినిమాలు నిర్మించేందుకు నిర్మాతలు ఆసక్తి చూపించలేదు. ఈ సమయంలో దిల్‌రాజు బ్యానర్‌లో సినిమా అనగానే అంతా కూడా అంచనాలు పెంచుకున్నారు. రాజ్‌ తరుణ్‌ కూడా ఈ చిత్రం సక్సెస్‌ అయితే మళ్లీ తన జోరు కొనసాగుతుందని, తప్పకుండా ఈ చిత్రం తన కెరీర్‌కు బూస్ట్‌ ఇస్తుందనే ఉద్దేశ్యంతో రాజ్‌ తరుణ్‌ పాజిటివ్‌ థింకింగ్‌తో ఉన్నాడు. ఈ సమయంలో దిల్‌రాజు చేసిన వ్యాఖ్యలు ఆయన గుండెను పగుల గొట్టేశాయి.

Dil Raju Wants To Spoil Raj Tharun Career-

Dil Raju Wants To Spoil Raj Tharun Career

తాజాగా ‘లవర్‌’ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా మాట్లాడిన దిల్‌రాజు కెరీర్‌ ప్రభావితం అయ్యేలా ఉన్నాయి. తాను ఏమాత్రం ఆసక్తిగా ‘లవర్‌’పై లేను అని, బలవంతంగా ఈ చిత్రానికి తనను నిర్మాణ భాగస్వామి చేసినట్లుగా చెప్పుకొచ్చాడు. తమ బ్యానర్‌లో అతి చిన్న చిత్రంగా ఇది నిలుస్తుందని, రాజ్‌ తరుణ్‌పై నాలుగు, అయిదు కోట్లు పెట్టడం చాలా ఎక్కువ. కాని మేము ఏకంగా 8 కోట్లు ఖర్చు చేశాం. రాజ్‌ తరుణ్‌ కోసం కాకుండా, సంస్థ ప్రతిష్టను కాపాడుకునేందుకు ఈ చిత్రాన్ని అంత బడ్జెట్‌తో చేశాం. సినిమాకు ఇంత రికవరీ అవుతుందనే నమ్మకం నాకు లేదు అని అన్నాడు.

రాజ్‌ తరుణ్‌ గత కొంత కాలంగా తన సినిమాకు నిర్మాతగా వ్యవహరించాలి అంటూ పట్టుబడుతున్న కారణంగానే తాను ఈ చిత్రాన్ని ఒప్పుకున్నాను అన్నాడు. ఇక ఈ చిత్రంలో పాటకో సంగీత దర్శకుడు అన్నప్పుడు అంత అవసరం లేదు అనిపించింది. కాని దర్శకుడు పట్టుబట్టడంతో సరే అనుకున్నాను. రాజ్‌ తరుణ్‌ ఈ బడ్జెట్‌ను రికవరీ చేస్తాడన్న నమ్మకం నాకు లేదు. అయితే మా సంస్థపై ప్రేక్షకుల్లో ఉన్న నమ్మకంతో కొద్దిగొప్ప అయినా వస్తుందేమో చూడాలి అంటూ దిల్‌రాజు సంచలన వ్యాఖ్యలు అన్నాడు. ఈ వ్యాఖ్యలు ఎవరో, ఎవరితోనే అన్నవి కాదు. మీడియా సమావేశంలో దిల్‌రాజు అన్న మాటలు. ఈ మాటలతో రాజ్‌ తరుణ్‌ కెరీర్‌ నాశనం కావడం ఖాయం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.