'వి' కోసం దిల్‌ రాజు చర్చలు ఫలించి ప్రదర్శించేనా?  

దిల్‌ రాజు నిర్మించిన ‘వి’ సినిమా అమెజాన్‌ ద్వారా వచ్చి ప్రేక్షకులను నిరాశ పర్చిన విషయం తెల్సిందే.నాని.

TeluguStop.com - Dil Raju Trying To Release V Movie In Theaters

సుధీర్‌ బాబులు హీరోలుగా నటించిన ఆ సినిమాపై అంచనాలు భారీగా వచ్చాయి.కాని అంచనాలను అందుకోవడంలో నిరాశ పర్చింది.

అమెజాన్‌ లో విడుదల అవ్వడం వల్ల కూడా మరింతగా నష్టం చేకూరింది అనే అనుమానాలు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు.ఈ సమయంలోనే థియేటర్లు ఓపెన్‌కు రంగం సిద్దం అయ్యింది.

TeluguStop.com - వి’ కోసం దిల్‌ రాజు చర్చలు ఫలించి ప్రదర్శించేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం థియేటర్ల యాజమాన్యాలతో దిల్‌ రాజు ‘వి’ సినిమా విడుదల విషయమై చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది.మల్టీ ప్లెక్స్‌ ల్లో కాకుండా సినిమాను కేవలం థియేటర్‌ ల్లోనే విడుదల చేయాలని భావిస్తున్నారు.

సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో ప్రేక్షకులు వస్తారనే నమ్మకంను దిల్‌ రాజు వ్యక్తం అవుతున్నాడు.

ఓటీటీ సినిమాలు ఇంకా మాస్‌ ఆడియన్స్‌ కు చేరలేదు.కనుక ఖచ్చితంగా సినిమాను సింగిల్‌ స్క్రీన్‌ ప్రేక్షకులు ఆధరిస్తారు అనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.

గతంలో థియేటర్ల యాజమాన్యాలు ఓటీటీ లో విడుదల అయిన సినిమాలను థియేటర్లలో విడుదల చేయనిచ్చేది లేదు అన్నారు.అలాగే ఓటీటీలో సినిమాను థియేటర్లలో విడుదల అయిన 50 రోజుల తర్వాతే స్ట్రీమింగ్ చేయాలనే కండీషన్‌ కూడా పెట్టారు.

ఈ కండీషన్స్‌ అన్ని కూడా ఉన్న కారణంగా ఓటీటీ మరియు థియేటర్ల మద్య కాస్త సీరియస్‌ చర్చలు జరుగుతున్నాయి.ఈసమయంలో ఓటీటీలో విడుదల అయిన సినిమాను ఎలా థియేటర్లలో విడుదల చేస్తారు అని కొందరు అంటున్నారు.

అయితే దిల్‌ రాజు నుండి వస్తున్న ప్రతిపాదన కు చాలా మంది థియేటర్ల యాజమాన్యాలు ఒప్పుకుంటున్నాయని అంటున్నారు.ఎందుకంటే ఈ సమయంలో జనాలను థియేటర్లకు తీసుకు రావడం ముఖ్యం.

కనుక ఖచ్చితంగా ‘వి’ సినిమాను విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు.

#Nani #DilRaju #Nani V Movie #VMovie #V Ott Movie

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు