అతడే శ్రీమన్నారాయణను తెలుగులో వదులుతున్న స్టార్ నిర్మాత

కన్నడ హీరో రక్షిత్ శెట్టి నటిస్తున్న తాజా చిత్రం ‘అతడే శ్రీమన్నారాయణ’ పోస్టర్స్, టీజర్ ఇప్పటికే ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి.ఈ సినిమాలో రక్షిత్ శెట్టి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.

 Dil Raju To Release Athade Srimanarayana In Telugu-TeluguStop.com

కాగా ఇదొక థ్రిల్లర్ యాక్షన్ మూవీగా తెరకెక్కినట్లు చిత్ర యూనట్ తెలిపింది.అయితే ఈ సినిమాను తెలుగులో ఓ స్టార్ ప్రొడ్యూసర్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రచారం సాగుతుండగా తాజాగా అది కన్ఫం చేశారు చిత్ర యూనిట్.

తెలుగులో శ్రీమన్నారాయణ చిత్రాన్ని ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో చిత్ర యూనిట్ ఇదే విషయాన్ని కన్ఫం చేశారు.2020 జనవరి 1న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.నిధి కోసం సాగే వేటగా ఈ సినిమా కథ సాగుతుందని తెలుస్తోంది.

రక్షిత్ శెట్టి యాక్టింగ్ ఈ సినిమాకు మేజర్ అసెట్ కానుందని చిత్ర యూనిట్ తెలిపింది.

శాన్వీ శ్రీవాత్సవ్ హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ సినిమాను సచిన్ రవి డైరెక్ట్ చేయగా కొత్త సంవత్సరం కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

మరి ఈ సినిమా కన్నడతో పాటు తెలుగులో ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube