వకీల్ సాబ్‌లో జాన్వీ లాంఛ్.. కానీ!  

Dil Raju To Launch Janhvi Kapoor - Telugu Boney Kapoor, Dil Raju, Janhvi Kapoor, Pawan Kalyan, Vakeel Saab

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో రీఎంట్రీ ఇస్తూ వరుసబెట్టి సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే వకీల్ సాబ్ అనే చిత్రంలో నటిస్తున్న పవన్, వరుసబెట్టి సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతున్నాడు.

 Dil Raju To Launch Janhvi Kapoor

బాలీవుడ్‌లో సూపర్ సక్సెస్ అయిన పింక్ చిత్రాన్ని తెలుగులో వకీల్ సాబ్‌గా తెరకెక్కిస్తున్నాడు పవన్.ఇక ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

అయితే ఈ సినిమా ఆడియో లాంఛ్‌లో దిల్ రాజు అలనాటి మేటి నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ను లాంఛ్ చేసేందుకు రెడీ అవుతున్నాడట.ఈ మేరకు బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌తో ఒప్పందం కూడా చేసుకున్నాడట.

వకీల్ సాబ్‌లో జాన్వీ లాంఛ్.. కానీ-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇప్పటికే వకీల్ సాబ్ చిత్రాన్ని దిల్ రాజుతో కలిసి బోనీ కపూర్ ప్రొడ్యూస్ చేస్తుండటంతో, వారిద్దరూ ఈ ఒప్పందానికి ఓకే అన్నారట.తన బ్యానర్‌లోనే లాంఛ్ చేసేందుకు దిల్ రాజు రెడీ అయ్యాడు.

అయితే జాన్వీ కపూర్‌ను తెలుగులో లాంఛ్ చేసే డైరెక్టర్ ఎవరు? ఈ సినిమాలో హీరోగా ఎవరు నటిస్తారు అనేవి ఆసక్తికర అంశాలుగా మారాయి.మరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఎలాంటి సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెడుతుందో చూడాలి అంటున్నారు తెలుగు ప్రేక్షకులు.

ఇక ఇటీవల దిల్ రాజు రెండో వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.ఇక ప్రస్తుతం లాక్‌డౌన్ సడలింపు ఉండటంతో దిల్ రాజు తిరిగి సినిమా పనుల్లో బిజీ అవుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు