దిల్‌ రాజు ఆశ్చర్యకర నిర్ణయం... చిన్న నిర్మాతలు ఆందోళన  

  • తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాతల జాబితా తీస్తే ముందు వరుసలో ఉండే నిర్మాత దిల్‌రాజు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గత దశాబ్ద కాలంగా నిర్మాతగా స్టార్‌ హీరోలతో, చిన్న హీరోలతో ఎన్నో చిత్రాలను నిర్మించిన దిల్‌రాజు మరో వైపు డిస్ట్రిబ్యూటర్‌గా కూడా సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. తెలుగు సినిమా పరిశ్రమలో డిస్ట్రిబ్యూటర్‌గా ఎంట్రీ ఇచ్చిన దిల్‌రాజు ఆ తర్వాత నిర్మాతగా మారాడు. డిస్ట్రిబ్యూషన్‌పై ఉన్న మమకారంతో నిర్మాణంలోకి అడుగు పెట్టినా కూడా కొనసాగుతూ వచ్చాడు. తాజాగా దిల్‌రాజు డిస్ట్రిబ్యూటర్‌గా వరుసగా నిరాశ పర్చే సినిమాలను విడుదల చేశాడు.

  • Dil Raju Takes Sensational Decision On Film Distribution-Dil About Distribution Dil New Movie Next Trolls

    Dil Raju Takes Sensational Decision On Film Distribution

  • 2.ఓ చిత్రంతో పాటు వినయ విధేయ రామ చిత్రాలు దిల్‌రాజుకు తీవ్ర నష్టాలను మిగిల్చాయి. అందుకే ఇకపై డిస్ట్రిబ్యూషన్‌పై శ్రద్ద పెట్టడం లేదని ప్రకటించాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో దిల్‌రాజు ఆ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. అందుకు సంబంధించిన విషయమై గత కొన్ని రోజులుగా సన్నిహితులతో చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకున్నాడు. డిస్ట్రిబ్యూటర్‌గా ప్రస్తుతానికి ఫుల్‌ స్టాప్‌ పెట్టాలనేది ఆయన ఉద్దేశ్యంగా తెలుస్తోంది. చాలా ఏళ్లుగా డిస్ట్రిబ్యూటర్‌గా సినిమాలు విడుదల చేస్తున్న కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన చేతిలో చాలా థియేటర్లు ఉండేవి. దాంతో చిన్న సినిమాల విడుదల సమయంలో ఆయనే పెద్ద దిక్కుగా నిలిచేవాడు.

  • Dil Raju Takes Sensational Decision On Film Distribution-Dil About Distribution Dil New Movie Next Trolls
  • డిస్ట్రిబ్యూటర్‌గా ఎన్నో చిన్న చిత్రాలను పెద్ద సక్సెస్‌ చేసిన ఘనత దిల్‌రాజుకు దక్కుతుంది. అందుకే ఆయనకు చిన్న నిర్మాతలు ఎంతో మంది రుణపడి ఉంటారు. చిన్న సినిమాలను ఆయన పంపిణీ చేసేందుకు తీసుకుంటే పెద్ద సక్సెస్‌లు అవుతాయి. అందుకే చిన్న నిర్మాతలు తమ సినిమాలను దిల్‌రాజుకు చూపించి తీసుకోమని కోరేవారు. ఇప్పుడు దిల్‌రాజు డిస్ట్రిబ్యూషన్‌ వదిలేయడంతో అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి దిల్‌రాజు నిర్ణయం సినీ వర్గాల వారిలో కూడా ఒకింత ఆశ్చర్యంను కలిగిస్తోంది.