వినాయక్ సినిమాని మూల పడేసిన దిల్ రాజు  

Dil Raju Stop Vv Vinayak Movie - Telugu Dil Raju Stop, Seenayya, South Cinema, Tollywood, Vv Vinayak Movie

నిర్మాత దిల్ రాజు దర్శకుడు వినాయక్ ని హీరోగా పరిచయం చేస్తూ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైంది.

Dil Raju Stop Vv Vinayak Movie

కొంత వరకు టాకీ పార్ట్ కూడా పూర్తి చేసుకుంది.వినాయక్ ఈ సినిమాకి సంబందించిన రషెస్ చూసిన తర్వాత తీవ్ర అసంతృప్తికి గురైనట్లు తెలుస్తుంది.

సినిమా అస్సలు భాగా రాలేదని, ఇంకా దీనిని కొనసాగిస్తే పెట్టిన డబ్బు మొత్తం నష్టపోవాల్సి వస్తుందని దిల్ రాజుకి వినాయక్ చెప్పడంతో సినిమా షూటింగ్ ని ఆపేసినట్లు టాక్ వినిపిస్తుంది.ఇక ఈ సినిమాని కొనసాగించే ఉద్దేశ్యం లేదని కూడా తెలుస్తుంది.

ఈ సినిమా కథ గతంలో వచ్చిన ఒక సూపర్ హిట్ సినిమాని పోలి ఉందని దిల్ రాజుకి చెప్పి సినిమా ఆపేయమని సలహా ఇచ్చినట్లు తెలుస్తుంది.ఇక దిల్ రాజు కూడా అవుట్ పుట్ చూసిన తర్వాత వినాయక్ నిర్ణయం మేరకు వెనక్కి తగ్గినట్లు చెప్పుకుంటున్నారు.

టాలీవుడ్ లో చాలా మంది దర్శకులు హీరోలుగా మారి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.ఇక ఆ వరుసలో దాసరి నారాయణరావు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.అతను దర్శకుడుగా ఎంత సక్సెస్ అయ్యాడో నటుడుగా కూడా అంతే సక్సెస్ అయ్యాడు.చేతిలో సినిమాలు ఏవీ లేకపోవడంతో అతని దారిలో వినాయక్ ప్రయత్నం చేశాడు.

అయితే వర్క్ అవుట్ కాకపోవడంతో అర్ధంతరంగా ఆగిపోవాల్సి వచ్చింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test