దిల్‌రాజు గారు ఇది మరీ ఓవర్‌ అనిపించడం లేదా..?

మహేష్‌ బాబు 25వ చిత్రంగా వచ్చిన మహర్షి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు అని చెప్పక తప్పదు.ఫ్యాన్స్‌ బాగానే ఉందంటున్నా కూడా రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలను కోరుకునే సాదారణ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాకు పెదవి విరుస్తున్నారు.

 Dil Raju Sir Doesnt It Became Over-TeluguStop.com

మెసేజ్‌ ఓరియంటెడ్‌ మూవీస్‌ అయినా పర్వాలేదు కాని, మరీ ఓవర్‌గా మెసేజ్‌ ఇచ్చి, ఎంటర్‌టైన్‌మెంట్‌ లేకుండా చేస్తే మాత్రం తమ వల్ల కాదని ఈ చిత్రంతో మరోసారి ప్రేక్షకులు నిరూపించారు.తాము ఇలాంటి సినిమాలను ఆధరించము అంటూ ఖరాఖండీగా చెప్పేస్తున్నారు.

దాదాపు 135 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రంను రూపొందించినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది.ఇక ఈ చిత్రం అన్ని ఏరియాలకు కలిపి 100 కోట్ల బిజినెస్‌ చేసింది.

అన్ని రైట్స్‌ కలిపి 150 కోట్ల వరకు నిర్మాతల ఖాతాలో పడ్డాయి.దాంతో నిర్మాతలు సేఫ్‌ అయ్యారు.కాని 100 కోట్లతో రైట్స్‌ కొనుగోలు చేసిన బయ్యర్లు ఇప్పుడు బలి కాబోతున్నట్లుగా ట్రేడ్‌ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.ఆదివారం ముగిసే సమయంకు ఈ చిత్రం 50 కోట్ల షేర్‌ను రాబట్టింది.

ఇంకా 50 కోట్ల షేర్‌ను ఈ చిత్రం రాబడుతుందనే నమ్మకం లేదు.దాంతో ఈ చిత్రంను కొనుగోలు చేసిన బయ్యర్లు ఖచ్చితంగా లాస్‌ను ఎదుర్కోవాల్సి రావచ్చు.

అయితే దిల్‌రాజు మాత్రం ఈ విషయంను ఒప్పుకోవడం లేదు.తాజాగా దిల్‌రాజు మాట్లాడుతూ ఇలాంటి అద్బుతమైన సినిమాను ఇచ్చినందుకు బయ్యర్లు తన వద్దకు వచ్చి సంతోషంగా హగ్‌ ఇస్తున్నారంటూ చెప్పుకొచ్చాడు.

దిల్‌రాజు గారు ఇది మరీ ఓవర్‌ అ

దిల్‌రాజు ఇలాంటి మాటలు అప్పుడప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు.సినిమా స్థాయి పెంచడానికి, పబ్లిసిటీ కోసం.అయితే ఈసారి మాత్రం హగ్‌ ఇచ్చి బయ్యర్లు సంతోషంగా నా వద్ద ఆనందంను వ్యక్తం చేస్తున్నారని చెప్పడం కాస్త ఓవర్‌ అనిపిస్తోంది.లాస్‌ను ఎదుర్కోబోతున్న నిర్మాతలు అనూహ్యంగా హగ్‌ ఇవ్వడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.

దిల్‌రాజు ఇంకా కూడా మహర్షి చిత్రంను నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube