దిల్ రాజు సైలెన్స్ వెనుక అసలు కారణం ఇదే..?

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాతగా పవన్ కళ్యాణ్ హీరోగా వకీల్ సాబ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా అప్ డేట్స్ కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.

 Reasons Behind Dil Raju Silence About Vakeel Saab Promotions,vakeel Saab Promoti-TeluguStop.com

అయితే ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఎప్పుడొస్తుందో చిత్రయూనిట్ నుంచి ఎలాంటి ప్రకటన రావడం లేదు.ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తైనా ప్రమోషన్స్ విషయంలో చిత్రయూనిట్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.

Telugu Dil Raju, Ghmc, Janasena, Dilraju, Theaters, Vakeel Saab-Movie

వాస్తవానికి పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని చాలాకాలం నుంచి దిల్ రాజు ప్రయత్నించగా వకీల్ సాబ్ సినిమాకు నిర్మాతగా పవన్ అవకాశమిచ్చారు.సాధారణంగా దిల్ రాజు సినిమాలంటే సినిమా ప్రారంభమైనప్పటి నుంచి సినిమాపై హైప్ పెంచుతారు.అయితే వకీల్ సాబ్ సినిమా విషయంలో దిల్ రాజు సైలెన్స్ గా ఉండటానికి కారణం మాత్రం ప్రత్యక్షంగా, పరోక్షంగా పవన్ కళ్యాణ్ కారణమని తెలుస్తోంది.

Telugu Dil Raju, Ghmc, Janasena, Dilraju, Theaters, Vakeel Saab-Movie

పవన్ కళ్యాణ్ ఒకవైపు జనసేన పార్టీ కార్యకలాపాల్లో బిజీగా ఉంటూనే సినిమాల్లో నటిస్తున్నారు.గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్టు ప్రకటన చేశారు.మరోవైపు వచ్చే నెలలో రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరగబోతున్న నిహారిక చైతన్యల పెళ్లికి పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు.

దీంతో దిల్ రాజు వకీల్ సాబ్ సినిమా షూటింగ్ అయ్యే వరకు సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ మొదలుపెట్టకూడదని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Telugu Dil Raju, Ghmc, Janasena, Dilraju, Theaters, Vakeel Saab-Movie

మొదట సినిమా షూటింగ్ పూర్తైతే ఆ తరువాత ఆ తరువాత సినిమాను థియేటర్లలో విడుదల చేయాలో, ఓటీటీలో విడుదల చేయాలో నిర్ణయం తీసుకోవచ్చని దిల్ రాజు భావిస్తున్నారని తెలుస్తోంది.ప్రేక్షకులు సైతం థియేటర్లలో సినిమాలు చూడటానికి పెద్దగా ఆసక్తి చూపని నేపథ్యంలో దిల్ రాజు సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయాల్సి వస్తే సమ్మర్ లో విడుదల చేయాలని భావిస్తున్నారని సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube