మొగలి రేకులు హీరో బూరెల బుట్టలో పడ్డాడు  

Mogalirekulu hero Sagar New Movie Shaadi Mubarak First Look, Mogalirekulu Serial, Dil Raju, Sagar, RK Naidu New Movie - Telugu Dil Raju, Dil Raju Shadhi Mubaraq, Mogalirekulu Hero Sagar New Movie Shaadi Mubarak First Look, Mogalirekulu Serial, Rk Naidu, Rk Naidu New Movie, Sagar, Telugu Film News, Tollywood

తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు మొగలి రేకులు సీరియల్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఒకానొక సమయంలో ఆ సీరియల్‌ నెం.1 సీరియల్‌గా సాగిన విషయం తెల్సిందే.తెలుగు బుల్లి తెర సీరియల్స్‌ కు సరికొత్త హంగులు అద్దింది ఆ సీరియల్‌.

TeluguStop.com - Dil Raju Shadi Mubarak Mogalirekulu Serial Sagar

ఆ సీరియల్‌ తో ఆర్‌ కే నాయుడు హీరోగా పరిచయం అయ్యాడు.ఆ సీరియల్‌ లో ఆయన నటకు చాలా మంది అభిమానులు అయ్యారు.

ఆయన పలు సినిమాల్లో నటించాడు.ఆ సీరియల్‌ తో వచ్చిన పాపులారిటీతో సినిమా హీరోగా మారాలని ప్రయత్నించాడు.

TeluguStop.com - మొగలి రేకులు హీరో బూరెల బుట్టలో పడ్డాడు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

కాని అది సాధ్యం కాలేదు.కాస్త గ్యాప్‌ తర్వాత మళ్లీ ఆర్‌ కే నాయుడుకు ఛాన్స్‌ దక్కింది.

దిల్‌ రాజు బ్యానర్‌ లో ఆర్‌ కే నాయుడుకు హీరోగా ఆఫర్‌ దక్కింది.దిల్‌ రాజు బ్యానర్‌ లో పద్మశ్రీ దర్శకత్వంలో రూపొందుతున్న షాదీ ముబారక్‌ సినిమా లో హీరోగా ఆర్‌ కే నాయుడు నటిస్తున్నాడు.

ఈ సినిమాలో ముగ్గురు ముద్దుగుమ్మలు నటిస్తున్నారు.చాలా విభిన్నమైన ప్రేమ కథను దర్శకుడు పద్మశ్రీ చూపించబోతున్నాడు.అన్ని వర్గాల వారిని ఆకట్టుకోవడంతో పాటు యూత్‌ ఆడియన్స్ కు ఎక్కువగా కనెక్ట్‌ అయ్యే ఎలిమెంట్స్‌ తో ఈ సినిమా ఉంటుందని యూనిట్‌ సభ్యులు అంటున్నారు.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాను ఈ ఏడాది చివరి వరకు పూర్తి చేసి వచ్చే ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉంది.

దిల్‌ రాజు బ్యానర్‌ లో సినిమా అంటే బడ్జెట్‌ తో సంబంధం లేకుండా ప్రేక్షకులు సినిమా కోసం వెయిట్‌ చేస్తారు.అందుకే ఈ సినిమాకు కూడా ఖచ్చితంగా మంచి వసూళ్లు నమోదు అవుతాయి అంటూ ప్రేక్షకులు నమ్మకంగా ఉన్నారు.

ఇలాంటి సినిమాలో నటిస్తున్నందుకు ఆర్‌ కే నాయుడు అదృష్టవంతుడు.ఆయన బూరెల బుట్టలో పడ్డట్లే అంటూ నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

#Rk Naidu #Dil Raju #Sagar #DilRaju

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Dil Raju Shadi Mubarak Mogalirekulu Serial Sagar Related Telugu News,Photos/Pics,Images..