ఏపీ మంత్రి పేర్ని నానితో భేటీ అయిన తర్వాత దిల్ రాజు సంచలన కామెంట్స్..!!

టాలీవుడ్ నిర్మాతలు ఈరోజు ఏపీ మంత్రి పేర్ని నానితో సమావేశం అయ్యారు.భేటీ అయిన తర్వాత మంత్రి తో పాటు సినీ నిర్మాతలు మీడియాతో ముచ్చటించారు.

 Dil Raju Sensational Comments After Meeting Ap Minister Perni Nani , Dil Raju, P-TeluguStop.com

ఈ సందర్భంగా ఇండస్ట్రీ ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.మహమ్మారి కరోనా కష్టకాలంలో సినిమా ఇండస్ట్రీ ఎంతగానో నష్ట పోయింది అని మంత్రికి తెలిపారు.

అదే రీతిలో ఇండస్ట్రీ పై కరోనా ప్రభావం ఉండటం వల్ల థియేటర్ల సమస్యలు.గురించి గతంలోనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

అప్పట్లో మెగాస్టార్ చిరంజీవితో పాటు రాజమౌళి ఇంకా మరికొందరు.సీఎం జగన్ ని కలిసినట్లు, ఆ సమయంలో ఇండస్ట్రీ సమస్యల పట్ల సీఎం జగన్ సానుకూలంగా స్పందించినట్లు దిల్ రాజు గుర్తు చేశారు.

సినిమా అనేది చాలా సున్నితమైన అంశమని, ఎటువంటి సమస్య వచ్చినా ఆ ప్రభావం నిర్మాతలపై పడుతుందని, సినిమా సమస్యను రాజకీయం చేయొద్దని ఈ సందర్భంగా దిల్ రాజు మీడియాను కోరారు.అదే రీతిలో ఆన్లైన్ టికెట్ విధానాన్ని తామే ప్రభుత్వాన్ని కోరినట్లు క్లారిటీ ఇచ్చారు.

ఆ తరహా విధానం ద్వారా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అని దిల్ రాజు మీడియా సమక్షంలో చెప్పుకొచ్చారు.ఈ కార్యక్రమంలో దిల్ రాజుతో పాటు డివివి దానయ్య, బన్నీ వాసు, సునీల్, నారంగ్, వంశీరెడ్డి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube