రాజు గారు ఇలాంటివి వద్దండీ.. మీ బ్రాండ్ వ్యాల్యూ మీరే తగ్గించుకోవద్దు ప్లీజ్‌

ఇండస్ట్రీలో దిల్ రాజు అంటే ఒక బ్రాండ్‌.ఆయన నుండి సినిమాలు వస్తున్నాయి అంటే అందులో మ్యాటర్‌ ఉంటుందని అంతా నమ్ముతూ ఉంటారు.

 Dil Raju Released Shadhi Mubarakh Movie In Telugu States-TeluguStop.com

అలాంటి సినిమా లను ఇప్పటి వరకు ప్రేక్షకుల ఉందుకు తీసుకు వచ్చిన నిర్మాత దిల్‌ రాజు కొన్ని సార్లు విడుదల చేసిన సినిమా లను చూస్తుంటే నిజంగా ఇది దిల్ రాజు సినిమానేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతూ ఉంటాయి.కొత్త వారితో కంటెంట్ ఉన్న సినిమా ను తీసి విడుదల చేసిన దిల్ రాజు సూపర్‌ స్టార్‌ లతో కూడా సూపర్‌ హిట్ లను అందించాడు.

అలాంటి దిల్‌ రాజు ఇటీవల షాదీ ముబారక్‌ అనే సినిమాను తీసుకు రావడం జరిగింది.వేరే వారు నిర్మించిన షాదీ ముబారక్ సినిమా ను కొన్ని కారణాల వల్ల దిల్‌ రాజు తీసుకుని దాన్ని కాస్త మార్పులు చేర్పులు చేసి తన బ్రాండ్‌ ఇమేజ్ ఉపయోగించి పబ్లిసిటీ చేసి తన థియేటర్లలో విడుదల చేయడం జరిగింది.

 Dil Raju Released Shadhi Mubarakh Movie In Telugu States-రాజు గారు ఇలాంటివి వద్దండీ.. మీ బ్రాండ్ వ్యాల్యూ మీరే తగ్గించుకోవద్దు ప్లీజ్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సాదారణంగా మరెవ్వరైనా ఈ సినిమాను నిర్మించి విడుదల చేసి ఉంటే కనీసం వంద థియేటర్లు అయినా దొరికేవి కాదు.కాని ఈ సినిమాకు భారీ ఎత్తున థియేటర్లను దిల్ రాజు కేటాయించాడు.

పెద్ద సినిమా లు విడుదల అయినా కూడా ఈసినిమా కు ప్రత్యేకంగా ప్రాముఖ్యతను కల్పించారు.ఇంత ప్రత్యేకంగా విడుదల చేసిన ఈ సినిమాను ప్రేక్షకులు ఆధరించలేదు.కనీసం ఈ సినిమా కమర్షియల్‌ గా ఏమైనా పర్వాలేదు అనిపించిందా అంటే అది కూడా లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు పెదవి విరుస్తున్నారు.మరీ ఈ రేంజ్‌ చెత్త సినిమాను ఎలా దిల్‌ రాజు తీసుకున్నాడు.

ఇది ఆయన సినిమా అని ఎలా ప్రచారం చేసుకున్నాడు అంటూ ప్రేక్షకులు కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి సినిమా లను తీసుకు వచ్చి మీ బ్రాండ్‌ వ్యాల్యూ ను తగ్గించుకోవద్దంటూ దిల్‌ రాజుకు ఆయన అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.

#DilRaju #Dil Raju #Shadi Mubarakh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు