'సాహో'పై దిల్‌ రాజు నమ్మకం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది  

Dil Raju Putting More Believe In Sahoo Movie-hero Prabhas,sahoo Movie,sahoo Movie Release Date,telugu Movies Updates,telugu New Releasing Movies

ప్రభాస్‌ ‘బాహుబలి’ చిత్రం తర్వాత చేస్తున్న మూవీ ‘సాహో’. దాదాపు రెండేళ్లుగా ఈ చిత్రం చిత్రీకరణ జరుపుకుంటూనే ఉంది. భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రంను యూవీ క్రియేషన్స్‌ నిర్మాతలు వంశీ మరియు ప్రమోద్‌లు వారు ఏకంగా 300 కోట్ల బడ్జెట్‌తో సుజీత్‌ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం బడ్జెట్‌ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌తోనే రాబట్టే అవకాశం ఉందని ఇప్పటికే తేలిపోయింది. అన్ని ఏరియాల్లో థియేట్రికల్‌ రైట్స్‌ మరియు ఇతర రైట్స్‌ ద్వారా దాదాపుగా 450 నుండి 500 కోట్ల వరకు రాబట్టే అవకాశం ఉందని తెలుస్తోంది..

'సాహో'పై దిల్‌ రాజు నమ్మకం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది-Dil Raju Putting More Believe In Sahoo Movie

తాజాగా ఈ చిత్రం నైజాం రైట్స్‌ను దిల్‌రాజు కొనుగోలు చేసేందుకు నిర్మాతల వద్ద ప్రపోజల్‌ పెట్టడం జరిగింది. నైజాం ఏరియాతో పాటు ఉత్తరాంధ్ర ఏరియాను కూడా 45 నుండి 50 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇది బాహుబలి సినిమా రేటు కంటే ఎక్కువ అంటూ సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చివరి దశ చిత్రీకరణ జరుపుతున్నారు. విడుదల తేదీ దగ్గర పడబోతున్న నేపథ్యంలో బయ్యర్లు ఎగబడుతున్నారు..

ఇతర బయ్యర్ల కంటే ఎక్కువ మొత్తం కోట్‌ చేసి మరీ దిల్‌రాజు ఈ చిత్రంను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాడు. ఒక ప్రముఖ నిర్మాత ఈ చిత్రం నైజాం హక్కులను 30 కోట్లకు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించగా ఆయన కంటే దిల్‌రాజు అయిదు కోట్లు ఎక్కువ పెట్టేందుకు ముందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. సాహో చిత్రంపై దిల్‌రాజు నమ్మకం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని సినీ వర్గాల వారు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.