దిల్ రాజు.తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ ప్రొడ్యూసర్.తన కంపెనీ నుంచి ఎక్కువ సినిమాలు ఉత్పత్తి అవుతుంటాయి.అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి బడా నిర్మాతలు ఉన్నా.దిల్ రాజు మాత్రం ఎప్పుడూ దూకుడుతో ముందుకు దూసుకెళ్తుంటాడు.వాళ్ల నిర్మాణ సంస్థల నుంచి తరుచుగా భారీ సినిమాలు తెరకెక్కుతాయి.
భారీ బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కించేందుకు చాలా సమయం తీసుకుంటారు.కానీ దిల్ రాజు కాస్త డిఫరెంట్.
ఈ చిన్న పెద్దా అంటూ చూడడు.కథ నచ్చితే ఎంత వరకైనా వెళ్దాం అంటాడు.
ఓవైపు చిన్న సినిమాలు చేస్తూనే.మరోవైపు భారీ బడ్జెట్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంటాడు.
చిన్న పెద్దా కలివిడిగా ముందుకు సాగుతుంటాడు.
ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమకు తన నిర్మాణ సంస్థ నుంచే ఎక్కువ సినిమాలను అందిస్తున్నాడు.
ఏడాదికి పదుల సంఖ్యలు సినిమాలు నిర్మిస్తున్నాడు.తెలుగులో టాప్ ఫామ్ లో కొనసాగుతున్నాడు దిల్ రాజు.
ప్రస్తుతం ఆయన నిర్మాణంలో పలు సినిమాలు తెరకెక్కుతున్నాయి.అందులో సుమారు 10 సినిమాలు ఉన్నాయి.
ఇంతకీ అవేంటో ఇప్పుడు చూద్దాం.
* ఎఫ్ 3 : అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా ఒక సినిమా తెరకెక్కుతుంది
* జెర్సీ హిందీ రీమేక్ : గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో షాహిద్ కపూర్ హీరోగా ఒక సినిమా నిర్మాణం జరుగుతుంది.
* రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో సైతం దిల్ రాజు ఒక సినిమాను నిర్మిస్తున్నారు
* ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా మరొక సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది.
* అల్లు అర్జున్ సినిమా– త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉండగా ఆ చిత్రం సైతం దిల్ రాజు బ్యానర్లో తెరకెక్కుతుంది.
* రౌడీ బాయ్స్ : శ్రీహర్ష కన్నెగంటి డైరెక్క్షన్లో అశిష్ రెడ్డి హీరోగా ఒక చిత్రాన్ని ఇప్పటికే ప్రకటించారు.
* సూపర్ స్టార్ విజయ్ మొదటి సారి తెలుగు తెరపై నేరుగా చూసే అవకాశం దిల్ రాజు కల్పిస్తుండగా ఈ చిత్రానికి వంశి పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు.
* సూర్య హీరోగా తెలుగులో బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక స్ట్రెయిట్ తెలుగు మూవీ రాబోతుంది.
* థ్యాంక్యూ : దర్శకుడు విక్రమ్ కే కుమార్ తో నాగ చైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్స్ గా నటిస్తున్న చిత్రం ఇప్పటికే షూటింగ్ జరుపుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.
* శాకుంతలం : దర్శకుడు గుణశేఖర్ తో సమంత హీరోయిన్ గా ఒక చిత్రాన్ని అన్నౌన్స్ చేసి నిర్మాణం చేసారు.