డాన్స్ మాస్టర్ ని హీరోగా పరిచయం చేస్తున్న దిల్ రాజు

డాన్స్ మాస్టర్స్ హీరోలుగా మారడం సౌత్ సినిమాలలో చాలా రోజుల నుంచి జరుగుతూ వస్తుంది.దర్శకుడు శంకర్ స్టార్ డాన్స్ మాస్టర్ గా ఉన్న ప్రభుదేవాని హీరోగా మార్చి సినిమా తీశారు.

 Dil Raju Plan To Interduce Dance Master Yash Asa A Hero, Tollywood, Telugu Cinem-TeluguStop.com

ప్రేమికుడు టైటిల్ తో సినిమా చేసి సూపర్ హిట్ కొట్టారు.ఆ తరువాత ప్రభుదేవా ఓ వైపు కొరియోగ్రాఫర్ గా కొనసాగుతూనే హీరోగా చాలా సినిమాలలో నటించాడు.

కొన్ని సినిమాలలో స్పెషల్ అపీరియన్స్ పాత్రలు కూడా చేశాడు.తరువాత దర్శకుడుగా మారిపోయి ప్రస్తుతం బాలీవుడ్ లో ఉన్న స్టార్ దర్శకులలో ఒకడిగా కొనసాగుతున్నాడు.

ప్రభుదేవా దారిలోనే లారెన్స్ కూడా స్టైల్ సినిమాతో పూర్తి స్థాయి హీరోగా మారిపోయాడు.ఆ సినిమాతో అటు దర్శకుడుగా, ఇటు హీరోగా సక్సెస్ అయినా లారెన్స్ తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు.

లారెన్స్ హీరోగా, దర్శకుడుగా చేస్తున్న కాంచన సిరీస్ సినిమాలు ఎంత సక్సెస్ అయ్యాయో అందరికి తెలిసిందే.వీరిద్దరూ కొరియోగ్రాఫర్స్ గా కెరియర్ స్టార్ట్ చేసి హీరోలు, దర్శకులుగా సక్సెస్ అయ్యారు.

వీరి దారిలో అమ్మ రాజశేఖర్ దర్శకుడుగా మారి రణం సినిమాతో హిట్ కొట్టిన తరువాత.అతను హీరోగా ఒక సినిమా చేశాడు.అది ఇంకా రిలీజ్ కాలేదు.తాజాగా జానీ మాస్టర్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చేశాడు.

అతని సినిమా కూడా లాంచ్ అయిపోయింది.ఇప్పుడు ఇదే వరుసలో మరో డాన్స్ మాస్టర్ హీరోగా మారబోతున్నాడు.

ఢీ డాన్స్ షోతో పాపులర్ అయ్యి ప్రస్తుతం కొరియోగ్రాఫర్ గా సినిమాలు చేస్తున్న డాన్స్ మాస్టర్ యశ్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.దిల్ రాజు అతనిని హీరోగా లాంచ్ చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.

త్వరలో ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు బోగట్టా.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube