బాలయ్యతో మొదటి సినిమా చేస్తున్న దిల్ రాజు... దర్శకుడు ఎవరంటే

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా మీద అభిమానులకి భారీ అంచనాలు ఉన్నాయి.

 Dil Raju Movie With Balayya For Anil Ravipudi-TeluguStop.com

యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత బాలకృష్ణ చేయబోయే సినిమాల గురించి ఇప్పుడు టాలీవుడ్ హాట్ చర్చ నడుస్తుంది.

ఇప్పటికే క్రాక్ సినిమాతో హిట్ కొట్టిన గోపీచంద్ మలినేని బాలకృష్ణతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.కథ కూడా చెప్పి ఫైనల్ చేయించుకోవడంతో అతనికి బాలయ్యబాబు ఒకే చెప్పేశాడు.

 Dil Raju Movie With Balayya For Anil Ravipudi-బాలయ్యతో మొదటి సినిమా చేస్తున్న దిల్ రాజు… దర్శకుడు ఎవరంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక నిర్మాత కూడా సిద్ధంగా ఉండటంతో బోయపాటి తర్వాత అతనితోనే సినిమా చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది.అయితే ఇప్పుడు ఫ్రేమ్ లోకి సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఎంట్రీ ఇచ్చాడు.

వరుసగా ఐదు హిట్ సినిమాలతో స్టార్ దర్శకుడుగా మారిపోయిన అనిల్ రావిపూడి ఎప్పటి నుంచో బాలకృష్ణతో సినిమా చేయాలని అనుకుంటున్నాడు.గతంలో ఓ కథకూడా చెప్పడం జరిగింది.దానికి రామారావు అనే టైటిల్ కూడా అనుకున్నాడు.అయితే ఏవో కారణాల వలన ఆ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళలేదు.అయితే అనిల్ ఇప్పుడు అదే కథలో కొద్దిగా మార్పులు చేసి బాలకృష్ణకి వినిపించి ఫైనల్ చేయించుకున్నాడు.ఈ నేపధ్యంలో బాలకృష్ణ నుంచి సెట్స్ పైకి వెళ్ళే నెక్స్ట్ ప్రాజెక్ట్ అదే అనే మాట వినిపిస్తుంది.

ఇక ఈ సినిమాని దిల్ రాజు నిర్మించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.అనిల్ రావిపూడితో వరుస సినిమాలు చేస్తూ సక్సెస్ కొడుతున్న దిల్ రాజు మొదటి సారి అనిల్ కోసం బాలయ్యతో సినిమా చేస్తున్నాడనే మాట వినిపిస్తుంది.

ప్రస్తుతం అనిల్ రావిపూడి, దిల్ రాజు కాంబినేషన్ లో ఎఫ్3 మూవీ తెరకెక్కుతుంది.

#Boyapati Srinu #Anil Ravipudi #HindupurMla #Dil Raju

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు