దిల్‌రాజు మోజు పడ్డాడు.. నష్టం 9 కోట్లు       2018-05-13   22:31:18  IST  Raghu V

టాలీవుడ్‌లో దిల్‌రాజుకు ఒక బ్రాండ్‌ ఇమేజ్‌ ఉంది. ఆయన నిర్మించే సినిమాలు, డిస్ట్రిబ్యూట్‌ చేసే సినిమాలు తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయి. ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలను నిర్మించిన దిల్‌రాజు ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలను డిస్ట్రిబ్యూట్‌ చేసి తకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. దిల్‌రాజు ఒక సినిమాను నచ్చి, మెచ్చి కొన్నాడు అంటే తప్పకుండా అందులో మ్యాటర్‌ ఉండి ఉంటుందనే అభిప్రాయం అందరిలో ఉంది. తాజాగా దిల్‌రాజు ‘మెహబూబా’ చిత్రాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఆ సినిమా దిల్‌రాజుపై ప్రేక్షకుల్లో ఉన్న నమ్మకంను పూర్తిగా తీసి పారేసింది.

పూరి జగన్నాధ్‌ దర్శకత్వం ఆయన కొడుకు ఆకాష్‌ పూరి హీరోగా తెరకెక్కిన ‘మెహబూబా’ చిత్రంను సాదారణ ప్రేక్షకులు తప్పకుండా బాగుంటుందని అనుకున్నారు. అందరిలాగే దిల్‌రాజు కూడా సినిమా బాగుంటుందనే నమ్మకంతో దాదాపు 10 కోట్లకు కొనుగోలు చేయడం జరిగింది. దిల్‌రాజు అంత గుడ్డిగా ఎలా ఆ చిత్రాన్ని కొనుగోలు చేశాడు అంటూ ప్రస్తుతం అంతా కూడా షాక్‌ అవుతున్నారు. దిల్‌రాజుకు సినిమా గురించి పూరి అంతో ఇంతో చెప్పి ఉంటాడు. షూటింగ్‌ వివరాలను, ఇతరత్ర విషయాలను మరియు కొన్ని వీడియోలను కూడా దిల్‌రాజు తప్పకుండా చూసి ఉంటాడు. అయినా కూడా సరైన జడ్జ్‌మెంట్‌ ఇవ్వడంలో దిల్‌రాజు విఫలం అయ్యాడు

ఈ మద్య కాలంలో దిల్‌రాజు కాస్త అతి నమ్మకంతో వ్యవహరిస్తున్నాడు. ఆయన పద్దతి సినీ వర్గాల వారిలో మరియు ఆయనపై నమ్మకం ఉన్న వారిలో కూడా ఆగ్రహంను తెప్పిస్తుంది. దిల్‌రాజు గతంతో పోల్చితే సినిమాల జడ్జ్‌మెంట్‌ విషయంలో తేడా కొడుతోంది. కొన్ని సినిమాలను దిల్‌రాజు ఆ దర్శకుడిపై మరియు సినిమాకు వచ్చిన క్రేజ్‌ ఆధారంగా తీసుకోవడం జరుగుతుంది. అలా తీసుకున్న సినిమాలు బెడిసి కొట్టి కోట్ల నష్టాలు తెచ్చి పెడుతున్నాయి. అయినా కూడా దిల్‌రాజు పద్దతి మారడం లేదు.

పూరి జగన్నాధ్‌ ‘మెహబూబా’ స్టోరీ లైన్‌ చెప్పగానే ఇదో ‘మగధీర’ రేంజ్‌లో ఉంటుందని దిల్‌రాజు భావించి ఉంటాడు. ఎప్పుడైతే స్టోరీ లైన్‌ చెప్పాడో అప్పుడే మెహబూబాపై దిల్‌రాజు మోజు పెంచుకున్నాడు. ఇక సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయంలో సినిమాకు సంబంధించిన విషయాలు సినిమాపై అంచనాలు పెంచాయి. దాంతో అందరిలాగే దిల్‌రాజు కూడా సినిమాను గొప్పగా ఊహించుకుని భారీ రేటుకు కొనుగోలు చేశారు. తీరా సినిమా ఫ్లాప్‌ అవ్వడంతో దాదాపుగా 9 కోట్ల నష్టంను దిల్‌రాజు మూట కట్టుకోవాల్సి వచ్చింది. చిత్ర నిర్మాత పూరి మరిత నష్టపోయాడు అది వేరే విషయం అనుకోండి..!