దిల్ రాజు మాస్టర్ మైండ్‌ వర్కౌట్‌ అయ్యింది.. ఎఫ్‌ 3 ఆ విషయంలో సక్సెస్‌

సినిమా పంపిణీ రంగంలో దిల్‌ రాజు సుదీర్ఘమైన అనుభవం ఉంది.ఏ సినిమాను కొనుగోలు చేస్తే బాగుంటుంది.

 Dil Raju Master Plan For F3 Movie Big Collections , Dil Raju ,f3 Movie, F3 Movie-TeluguStop.com

ఎలాంటి సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకోవచ్చు అనేది ఆయనకు బాగా తెలుసు.ఇక సినిమాల విడుదల తేదీల విషయంలో ఆయన్ను మించి ప్లాన్ చేసే వారు ఏ ఒక్కరు ఇండస్ట్రీ లో లేరు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

భారీ ఎత్తున సినిమా లను ఆయన నిర్మించాడు.కొన్ని వందల సినిమాలను సమర్పించాడు.

డిస్ట్రిబ్యూట్‌ చేశాడు.ఆయన సినిమాలను పంపిణీ చేస్తే ఖచ్చితంగా హిట్‌ అనే ఒక అభిప్రాయం ఉంది.

అలాంటి దిల్ రాజు ఎఫ్ 3 సినిమా తో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.సినిమా విడుదల తేదీ విషయంలో పక్కా వ్యూహం ను అమలు చేసిన దిల్‌ రాజు యావరేజ్ సక్సెస్ అయినా కూడా మంచి వసూళ్లు నమోదు అయ్యాయి.

దిల్ రాజు పదవ తరగతి మరియు ఇంటర్ పరీక్ష లు పూర్తి అవ్వడంతో ఎఫ్ 3 సినిమా కు మంచి డిమాండ్ ఉంది.

పరీక్ష ల సీజన్ లో విడుదల అయిన సర్కారు వారి పాట నిరాశ పర్చింది.

సక్సెస్ దక్కించుకున్నా కూడా వసూళ్లు మాత్రం నిరాశ పర్చాయి.ఎఫ్ 3 సినిమా వసూళ్లు భారీగా నమోదు అవుతున్నాయి.

ప్రస్తుతం పరీక్ష ల సీజన్ పూర్తి అవ్వడంతో పాటు సమ్మర్‌ హాలీడేస్ అవ్వడం వల్ల ఎఫ్‌ 3 సినిమా కు ఫ్యామిలీ ఆడియన్స్ విపరీతంగా వస్తున్నారు.తద్వారా విడుదల అయిన మూడు రోజుల్లోనే భారీగా వసూళ్లు నమోదు చేసినట్లుగా ట్రేడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

Telugu Dil Raju, Review, Mehreen, Tamanna, Varun Tej, Venkatesh-Movie

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన వసూళ్ల విషయంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.కేవలం దిల్ రాజు మాస్టర్ ప్లాన్‌.ఆయన మాస్టర్ మైండ్ వల్లే ఈ స్థాయి లో ఎఫ్ 3 కి వసూళ్లు సాధ్యం అవుతున్నాయి అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఎఫ్ 3 సినిమా జస్ట్‌ యావరేజ్ అంటున్నారు.

అయినా కూడా మంచి వసూళ్లు వస్తున్నాయంటే దిల్‌ రాజు వ్యూహం.ఆ విషయం లో రాజు గారు పూర్తి సక్సెస్ అయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube