దిల్‌రాజుకు మళ్లీ ఇచ్చిన మహేష్‌... వంశీపై మరోసారి నమ్మకం  

Dil Raju Mahesh Movie Combination Again-

మహేష్‌బాబు తాజాగా తన 25వ చిత్రం మహర్షితో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రతిష్టాత్మక 25వ చిత్రం అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగానే మహర్షి చిత్రం ఒక మోస్తరుగా ఉంది. మొదటి మిశ్రమ స్పందన వచ్చినా కూడా మెల్ల మెల్లగా మంచి వసూళ్లు నమోదు అవ్వడం ప్రారంభం అయ్యింది. నాలుగు రోజుల్లో ఈ చిత్రం 100 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. రెండవ వారం పూర్తి అయ్యేప్పటికి 100 కోట్లు వసూళ్లు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో మహేష్‌ బాబు తర్వాత సినిమాల గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి..

దిల్‌రాజుకు మళ్లీ ఇచ్చిన మహేష్‌... వంశీపై మరోసారి నమ్మకం-Dil Raju Mahesh Movie Combination Again

తనకు మంచి సక్సెస్‌ను ఇచ్చినందుకు గాను దిల్‌రాజు మరియు వంశీలకు మరోసారి మహేష్‌బాబు అవకాశం ఇస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. తనకు లైఫ్‌లో ఎప్పటికి గుర్తుంచుకునే సినిమాను ఇచ్చినందుకు గాను దర్శకుడు వంశీతో మరోసారి సినిమా చేయాలనుకుంటున్నట్లుగా ఇప్పటికే మహేష్‌బాబు ప్రకటించాడు. ఇదే సమయంలో నిర్మాతలకు కూడా మరో సారి ఛాన్స్‌ ఇవ్వాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

త్వరలోనే మహేష్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు, అశ్వినీదత్‌లు కలిసి ఒక చిత్రం చేసే అవకాశం లేకపోలేదు అంటూ ప్రచారం జరుగుతోంది.

మహర్షి చిత్రం టాక్‌తో సంబంధం లేకుండా మంచి వసూళ్లను రాబడుతోంది. మహేష్‌బాబు కెరీర్‌లో బిగ్గెస్ట్‌ సినిమాగా ఇది నిలిచే అవకాశం ఉందని ట్రేడ్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక మహేష్‌ బాబు 26వ చిత్రంగా అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో సినిమాను చేయబోతున్నాడు. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.

అది కూడా ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఆ చిత్రం తర్వాత మళ్లీ మహర్షి కాంబో ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.