96 రీమేక్ ని మొదలెట్టిన దిల్ రాజు! జానుగా ప్రేక్షకుల ముందుకి  

96 రీమేక్ సినిమాని ప్రారంభించిన దిల్ రాజు. .

Dil Raju Launching 96 Movie Remake-dil Raju Launching,prem Kumar,samanta,sharvanand,tollywood

  • విజయ్ సేతుపతి, త్రిష కాంబినేషన్ లో తమిళంలో ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 96. క్లాసికల్ లవ్ స్టొరీగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమాకి తమిళ ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. దీంతో ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి చూపించిన టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు వెంటనే రీమేక్ రైట్స్ ని కొనేసి తమిళంలో సినిమా తెరకెక్కించిన ప్రేమ్ కుమార్ ని రంగంలోకి దించాడు.

  • 96 రీమేక్ ని మొదలెట్టిన దిల్ రాజు! జానుగా ప్రేక్షకుల ముందుకి-Dil Raju Launching 96 Movie Remake

  • ఇన్ని రోజులు ఈ సినిమా తెలుగు స్క్రిప్ట్ వర్క్ పై ద్రుష్టి పెట్టిన చిత్ర యూనిట్ తాజాగా సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ అయ్యింది.

    శర్వానంద్, సమంత హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి దిల్ రాజు జాను అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.

  • అలాగే ఉగాది సందర్భంగా శనివారం సినిమాని గ్రాండ్ గా ప్రారంభించారు. ఇదిలా తమిళ ఒరిజినాలిటీలో కొన్ని మార్పులు చేసి తెలుగు ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యే విధంగా దర్శకుడు కథని సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.

  • ఇక తాజాగా మజిలీతో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న సమంత కెరియర్ లో ఈ సినిమా మరో క్లాసిక్ గా నిలిచే అవకాశం ఉందని తెలుస్తుంది.