జాను విషయంలో దిల్ రాజు జడ్జిమెంట్ మరోసారి దొబ్బింది  

Dil Raju Judgement Failed On Janu Movie-director Prem Kumar,janu Movie,kollywood,tollywood

స్టార్ నిర్మాత దిల్ రాజు కొత్త దర్శకులని టాలీవుడ్ కి పరిచయం చేస్తూ హిట్స్ మీద హిట్స్ కొడుతూ ఉంటాడు.అలాగే కొత్త దర్శకుల టాలెంట్ ని తనకి అనుకూలంగా మార్చుకోవడంలో కూడా దిల్ రాజు దిట్ట అని చెప్పాలి.

Dil Raju Judgement Failed On Janu Movie-Director Prem Kumar Janu Movie Kollywood Tollywood

అయితే అతని నిర్ణయాలు కూడా అప్పుడప్పుడు బోల్తా పడుతూ ఉంటాయి.శ్రీనివాస కళ్యాణం సినిమా విషయంలో అతని జడ్జిమెంట్ ని ఎంత ఘోరంగా ప్రేక్షకులు తిప్పి కొట్టారో అందరికి తెలిసిందే.

ఇప్పుడు మరోసారి అలాంటి ఫలితమే జాను సినిమా విషయంలో కూడా ఎదురైంది.తమిళంలో రిలీజ్ అయిన 96 సినిమా చూసి ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయిన దిల్ రాజు ఏ మాత్రం ఆలోచించకుండా దాని రీమేక్ రైట్స్ కొనేసాడు.


తెలుగులో శర్వానంద్, సమంత కాంబినేషన్ లో జానుగా తెరకెక్కించారు.ఇదిలా ఉంటే తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా ఊహించని విధంగా ఘోరమైన ఫలితాన్ని చవిచూసింది.

ఈ సినిమాలో ఉండే ఓవర్ డ్రామా, ఎమోషన్ కి తెలుగు ప్రేక్షకులు అస్సలు కనెక్ట్ కాలేకపోయారు.దిల్ రాజు కెరియర్ లో మొట్టమొదటి రీమేక్ కూడా ఈ విధంగా దెబ్బ తీస్తుందని అనుకోని ఉండడు.

సినిమా మరీ డ్రమటిక్ గా ఉందనే అభిప్రాయం ప్రేక్షకుల నుంచి వ్యక్తం అవుతుంది.ఏదో జెన్యూన్ గా ప్రేమలో ఉండే ఎమోషన్ ని చూపించాల్లని ట్రై చేసిన దిల్ రాజుకి నిజంగా ఇది ఘోరమైన దెబ్బ అని చెప్పాలి.

జాను సినిమా రిజల్ట్ ద్వారా తమిళంలో సూపర్ హిట్ అయిన ప్రతి సినిమాని తెలుగు ప్రజలు ఆధారించరనే విషయాన్ని ఇప్పటికైనా గ్రహిస్తే మంచిది అని సలహా ఇస్తున్నారు.అయితే తమిళ వెర్షన్ తో సూపర్ హిట్ కొట్టి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు ప్రేమ్ కుమార్ తెలుగులో మాత్రం బొక్క బోర్లా పడ్డాడు.

తాజా వార్తలు

Dil Raju Judgement Failed On Janu Movie-director Prem Kumar,janu Movie,kollywood,tollywood Related....