జెర్సీ కోసం ఏకమైన స్టార్ ప్రొడ్యూసర్స్  

Dil Raju Jersey Hindi Remake In Geetha Arts-

న్యాచురల్ స్టార్ నాని నటించిన స్పోర్ట్స్ డ్రామా జెర్సీ బాలీవుడ్ రీమేక్ కి సిద్ధమవుతోంది.ఏప్రిల్ లో వచ్చిన జెర్సీ నానికి కూల్ హిట్ ని ఇచ్చి మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కేలా చేసింది.మొదట కరణ్ జోహార్ ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు టాక్ వచ్చింది...

Dil Raju Jersey Hindi Remake In Geetha Arts--Dil Raju Jersey Hindi Remake In Geetha Arts-

రీసెంట్ గా నిర్మాత దిల్ రాజు ఆ సినిమా హిందీ హక్కుల్ని అందుకున్నట్లు అఫీషియల్ ఎనౌన్సమెంట్ వచ్చింది.దీంతో రూమర్స్ చెక్ పడింది.అయితే దిల్ రాజుతో పాటు ఇప్పుడు అల్లు అరవింద్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగం కానున్నారు.

గీతా ఆర్ట్స్ కి నార్త్ లో మంచి బిజినెస్ డీల్స్ ఉండడంతో దిల్ రాజు అలోచించి ఆయనతో జత కలిసినట్లు టాక్.

Dil Raju Jersey Hindi Remake In Geetha Arts--Dil Raju Jersey Hindi Remake In Geetha Arts-

ఇక వీలైనంత త్వరగా ఈ సినిమాను సెట్స్ పైకి తేవాలని ఆలోచిస్తున్నారు.కథ ఒరిజినల్ దర్శకుడు గౌతమ్ హిందీలో కూడా జెర్సీని తెరకెక్కించే అవకాశం ఉంది.ఇంకా సినిమాలో నటీనటుల ఎవరెనేది చిత్ర యూనిట్ నిర్ణయించుకోలేరు.

త్వరలోనే ఆ విషయాలపై దిల్ రాజు క్లారిటీ ఇవ్వనున్నారు.