ప్రీవ్యూ : ‘జాను’ అసలు ఎందుకు ఇంత ప్రత్యేకం

తమిళంలో ఒక చిన్న చిత్రంగా కేవలం కోటి లోపు బడ్జెట్‌తో రూపొందిన 96 చిత్రం అక్కడ ఏకంగా 50 కోట్ల వరకు రాబట్టింది.అద్బుతమైన కథా నేపథ్యంతో ఆసక్తికర సన్నివేశాలతో సినిమాను తెరకెక్కించారు.

 Dil Raju Jaanu Samantha Sarvanand-TeluguStop.com

ఫీల్‌ గుడ్‌ మూవీ అంటూ టాక్‌ తెచ్చుకున్నా కూడా కమర్షియల్‌గా అద్బుత విజయాన్ని ఈ చిత్రం సొంతం చేసుకుంది.ఇలాంటి సినిమాలను రీమేక్‌ చేయడం అంటే చాలా పెద్ద సాహసం.

అయినా కూడా దిల్‌రాజు ముందుకు వచ్చాడు.మొదట వద్దనుకున్న వారు అంతా కూడా ఈ సినిమా ఎలా ఉంటుందా అనే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

జాను చిత్రం ప్రతి ఒక్కరి స్కూల్‌ డేస్‌ జీవితాన్ని కళ్ల ముందు ఉంచుతుంది.జీవితంలో ఎన్నో జరుగుతుంటాయి.కాని స్కూల్‌ డేస్‌లో జరిగిన సంఘటనలు మరియు ఆ సమయంలో ప్రేమలు చాలా చాలా ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు.ఎంతో మంది మాట్లాడే ధైర్యం లేక కేవలం కళ్లతో ప్రేమించేస్తూ ఉంటారు.

స్కూల్‌ డేస్‌లో 99 శాతం ప్రేమలు విఫలం అవుతాయి.కాని ఆ ప్రేమలు జీవితాంతం గుర్తుండి పోతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Telugu Dil Raju, Jaanu, Jaanu Preview, Samantha, Sarvanand-

అలాంటి ఫీలింగ్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాను చూసి తమ గతంలోకి తొంగి చూసుకోవాలని ఆశ పడుతున్నారు.అందుకే జానుకు మంచి క్రేజ్‌ ఉంది.యూత్‌ ఆడియన్స్‌తో పాటు పెద్ద వారు కూడా ఈ చిత్రం చూసే విధంగా ఉంటుంది.దిల్‌రాజు చాలా నమ్మకంతో నిర్మించిన ఈ చిత్రం సెన్షేషనల్‌ సక్సెస్‌ అవుతుందా చూడాలి.రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న జాను ఫస్ట్‌ రివ్యూ కోసం మా సైట్‌ను ఫాలో అవుతూ ఉండండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube