ఇప్పటివరకు దిల్ రాజు ఎంత మంది దర్శకులను పరిచయం చేశారంటే?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాతలలో ఒకరిగా దిల్ రాజు తనకంటూ ఓ చరిత్ర సృష్టించుకున్నాడు.దిల్ రాజు అంటే తెలియని తెలుగు సినీ అభిమాని ఉండడు.

 Dil Raju Introduced Directors-TeluguStop.com

ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరోతో సినిమా చేసి ఏదో ఒక రూపంలో ఆయా హీరోల ఫ్యాన్స్ కు దిల్ రాజు సుపరిచితం.సినిమా పరిశ్రమలో ఒకటి రెండు సినిమాలు తీయడమే చాలా పెద్ద విషయంగా భావిస్తారు.

కాని గత 18 సంవత్సరాలుగా రకరకాల స్టోరీలను ఎన్నుకుంటూ వాటిని తెరకెక్కించడంలో తనకంటూ ప్రత్యేకంగా ఒక శైలిని ఏర్పరచుకొని దిల్ రాజు సినిమా ఒకే చేసాడంటే ఆ సినిమా హిట్ అనేంతలా ప్రేక్షకులలో కావచ్చు, సినిమా పరిశ్రమలో కావచ్చు ఒక స్పష్టమైన ముద్ర వేసాడు దిల్ రాజు.సాధారణంగా అగ్ర నిర్మాతలు ఎక్కువ సేఫ్ జోన్ లో ఉండడానికి ప్రయత్నిస్తారు.

 Dil Raju Introduced Directors-ఇప్పటివరకు దిల్ రాజు ఎంత మంది దర్శకులను పరిచయం చేశారంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాని దిల్ రాజు రూటే సెపరేటు కదా.ఎక్కడ ఎవరి దగ్గర మంచి స్టోరీ నచ్చినా కొత్త దర్శకుడైనా సరే అతనిని నమ్మి కోట్లు ఖర్చు పెట్టగలిగే దమ్మున్న నిర్మాత దిల్ రాజు.ఇలా ఇప్పటివరకు ఓ పది మంది కొత్త దర్శకులను పరిచయం చేసారనే చెప్పవచ్చు.బొమ్మరిల్లు సినిమా ద్వారా బొమ్మరిల్లు భాస్కర్ ను, ఆర్య సినిమా ద్వారా సుకుమార్ ను, ఓ మై ఫ్రెండ్ ద్వారా వేణు శ్రేరాం, మున్నా సినిమా ద్వారా వంశీ పైడిపల్లి, పాగల్ సినిమా ద్వారా నరేష్ కుప్పిలిని, జాను రీమేక్ ద్వారా ప్రేమ్ కుమార్ ను, వరుణ్ సందేశ్ హీరోగా నటించిన మరో చరిత్ర సినిమా ద్వారా రవి యాదవ్ ను దర్శకులుగా తన స్వంత ప్రొడక్షన్ ద్వారా దిల్ రాజు వెండి తెరకు పరిచయం చేసారు.

#@DilRaju19 #Top Directors #Dil Raju Movies #Film Industry

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు