హిట్ మూవీని బాలీవుడ్ లో తీసుకెళ్తున్న దిల్ రాజు  

Dil Raju Hit Movie Hindi Remake Rights - Telugu Bollywood, Dil Raju Got Hit Movie Hindi Remake Rights, South Cinema, Telugu Cinema, Tollywood

ఈ మధ్య కాలంలో తెలుగులో తెరకెక్కి సూపర్ హిట్ అవుతున్న చిన్న సినిమాలు హిందీలో రీమేక్ అవుతున్నాయి.అక్కడకూడా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంటున్నాయి.

 Dil Raju Hit Movie Hindi Remake Rights

తెలుగులో కంటే ఎక్కువ కలెక్షన్స్ ని హిందీలో రాబడుతున్నాయి.అర్జున్ రెడ్డి సినిమా బాలీవుడ్ లో రీమేక్ అయ్యి ఏకంగా రెండు వందల కోట్లు కలెక్ట్ చేసింది.

ఇప్పుడు ఇదే వరుసలో చాలా సినిమాలు రీమేక్ అవుతున్నాయి.అందులో నాని జెర్సీ మూవీ కూడా ఒకటి.

హిట్ మూవీని బాలీవుడ్ లో తీసుకెళ్తున్న దిల్ రాజు-Movie-Telugu Tollywood Photo Image

ఈ సినిమాని హిందీలో దిల్ రాజు, అల్లు అరవింద్ కలిసి నిర్మిస్తున్నారు.అయితే ఈ సారి దిల్ రాజు మరో రీమేక్ తో సోలోగా తన అదృష్టం పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నాడు.

అందులో భాగంగా నాని నిర్మాతగా శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్ మూవీని హిందీలో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు.మర్డర్ మిస్టరీని చేధించే క్రమంలో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ని డాక్యుమెంటరీ తరహా డీటైలింగ్ తో చూపించిన ఈ సినిమా ప్రేక్షకులకి మంచి థ్రిల్ ని కలిగించిందనేది వాస్తవం.

ఈ సినిమా హిందీ రీమేక్ హక్కులని టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు దక్కించుకున్నాడట.గత కొన్ని రోజులుగా రీమేక్ లపై ఎక్కువ నమ్మకం పెట్టుకున్న దిల్ రాజు హిట్ రీమేక్ ద్వారా హిందీలో గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తాడేమో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Dil Raju Hit Movie Hindi Remake Rights Related Telugu News,Photos/Pics,Images..

footer-test