తమిళ్ హీరోకు రూ.100 కోట్ల ఆఫర్ ఇచ్చిన దిల్ రాజు?

ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే కేవలం దక్షిణాది రాష్ట్రాలకు మాత్రమే పరిచయం.అయితే ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ పై చాలామందికి దర్శకనిర్మాతలు చూపబడింది.

 Dil Raju Hero Vijay Vamshi Paidipally Movie-TeluguStop.com

ఈ క్రమంలోనే చాలా మంది తమిళ దర్శకులు, హీరోలు తెలుగు ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తున్నారు.ఇప్పటివరకు తమిళంలో వారు నటించిన సినిమాలు తెలుగులో డబ్ అవుతూ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

అయితే ప్రస్తుతం పలువురు తమిళ దర్శకులు, హీరోలు స్వయంగా తెలుగులోనే సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించడం గమనార్హం.

 Dil Raju Hero Vijay Vamshi Paidipally Movie-తమిళ్ హీరోకు రూ.100 కోట్ల ఆఫర్ ఇచ్చిన దిల్ రాజు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే దర్శకుడు శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఓ పాన్ ఇండియా చిత్రానికి శ్రీకారం చుట్టారు.

ఈ చిత్రాన్ని తెలుగు బడా నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.అదేవిధంగా హీరోలు కార్తీ, సూర్య, విజయ్, ధనుష్ దర్శకుడు లింగుస్వామి వంటి వారు కూడా తెలుగులో సినిమాలు చేయడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు.

అదే విధంగా ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రం రాబోతోంది.

ఇక 2019 వ సంవత్సరంలో మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన “మహర్షి” సినిమా గురించి మనకు తెలిసిందే.ఈ సినిమా తర్వాత వంశీ పైడిపల్లి ఎలాంటి సినిమాలు చేయలేదు.ఈ క్రమంలోనే వంశీ పైడిపల్లి మహేష్ బాబు హీరోగా భారీ మాఫియా సినిమాను తెరకెక్కించబోతున్నారని వార్తలు వినిపించాయి.

అయితే ఈ విషయం గురించి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.అయితే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం వంశీపైడిపల్లి తమిళ హీరో విజయ్ కాంబినేషన్ లో పాన్ ఇండియా చిత్రం తెరకెక్కబోతుందనే వార్తలు వినపడుతున్నాయి.

ఈ సినిమాను దిల్ రాజు నిర్మించబోతున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమాలో నటించడం కోసం దిల్ రాజు హీరో విజయ్ కి ఏకంగా వంద కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది లేదు అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది.

#Maharshi #100Crores #Mahesh Babu #DilRaju #Dil Raju

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు