వి సినిమా విషయలో ఓటీటీ ఆ విధంగా దిల్ రాజుకి ఉపయోగపడింది

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ నిర్మాతలలో దిల్ రాజు పేరు కచ్చితంగా ఉంటుంది.అందరికంటే ఎక్కువ సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతగా దిల్ రాజు హవా టాలీవుడ్ లో కొనసాగుతుంది.

 Dil Raju Has Decided About V's Ott Release, Tollywood, Telugu Cinema, Natural St-TeluguStop.com

ఓ వైపు తక్కువ బడ్జెట్ తో యంగ్ హీరోలతో సినిమాలు తీస్తూ మరో వైపు భారీ బడ్జెట్ తో పవన్ కళ్యాణ్ లాంటి స్టార్స్ తో సినిమాలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు.సినిమాల విషయంలో అతని కేలిక్యులేషన్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుందని చాలా మంది నమ్ముతారు.

తన సొంత ప్రొడక్షన్ లో తీసిన సినిమా అయిన ఫ్లాప్ అవుతుందని అనుకుంటే ఆ సినిమా ప్రమోషన్ పై పెద్దగా ఆసక్తి చూపించరు.సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని నమ్మితే ఆ సినిమా ప్రచారానికి ఎంతైనా ఖర్చు పెడతారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు దిల్ రాజుకి ఓటీటీ రూపంలో తన సినిమాలకి కొత్త బిజినెస్ దొరికిందని టాక్ వినిపిస్తుంది.

నాని, సుధీర్ బాబు హీరోలుగా ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ వి సినిమా తాజాగా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యింది.

ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ చేసుకొని థియేటర్ లో రిలీజ్ కోసం వెయిట్ చేశారు.అయితే థియేటర్లు ఓపెన్ చేసే పరిస్థితి లేకపోవడం నిర్మాత దిల్ రాజు అమెజాన్ ప్రైమ్ కి సినిమాని 32 కోట్లకి అమ్మేశారు.

తాజాగా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యింది.అయితే సినిమా చూసిన తర్వాత దిల్ రాజు వి సినిమాని అమెజాన్ కి ఇచ్చేయడానికి కారణం ఏంటో అనేది అందరికి అర్ధమయ్యింది.

ట్రైలర్ తో భారీ హైప్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమాలో విషయం ఏమీ లేదని, ఇంద్రగంటి రొటీన్ క్రైమ్ థ్రిల్లర్ ని ఏదో కొత్తగా చూపించే ప్రయత్నం చేసినట్లు ఎలివేషన్ ఇచ్చారు తప్పు ఏమీ లేదని తేలిపోయింది.సినిమాలో చెప్పుకోవడానికి నాని పెర్ఫార్మెన్స్ తప్ప మొత్తం వీక్ అని ఆడియన్స్ తేల్చేశారు.

కథ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్ ఇలా ఏ విషయంలో కూడా సినిమా బెస్ట్ అనిపించుకోలేదు.ఇక సుధీర్ బాబు, ఇద్దరు హీరోయిన్స్ పాత్రలు కూడా అనుకున్న స్థాయిలో క్లిక్ అవ్వలేదు.

ఈ రిజల్ట్ ముందే ఊహించి దిల్ రాజు సినిమాని ఓటీటీకి అమ్మేసినట్లు చెప్పుకుంటున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube