వకీల్ సాబ్ దెబ్బకు పేపర్లు ఎగరేస్తున్న దిల్ రాజు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ ఎట్టకేలకు నేడు థియేటర్లలోకి వచ్చేసింది.ఈ సినిమాను దర్శకుడు వేణు శ్రీరామ్ తనదైన మార్క్‌తో తెరకెక్కించే ప్రయత్నం చేశాడు.

 Dil Raju Fan Moment In Vakeel Saab Show, Dil Raju, Pawan Kalyan, Tollywood News,-TeluguStop.com

ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మె్న్స్ ఇచ్చాడని చిత్ర యూనిట్ మొదట్నుండీ చెబుతూ వస్తోంది.కాగా నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమాను కొన్ని చోట్ల ప్రీమియర్స్ షో వేశారు.

ఈ ప్రీమియర్ షోలో వకీల్ సాబ్ చిత్ర నిర్మాత దిల్ రాజు కూడా పాల్గొన్నారు.

హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌లో ప్రదర్శించిన వకీల్ సాబ్ ప్రీమియర్ షోకు దిల్ రాజు తన భార్యతో సహా వచ్చారు.

కాగా ఈ సినిమాలో పవన్ ఎంట్రీ సీన్‌కు దిల్ రాజు సాధారణ అభిమానిగా మారిపోయి, తన చేతిలోని పేపర్ ముక్కలను పైకి విసిరారు.వకీల్ సాబ్‌లో పవన్ కళ్యాణ్ పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌ను థియేటర్లో చూసేందుకే తాను సినిమాకు వచ్చానని ఆయన చెప్పుకొచ్చాడు.

ఇక పవన్ బొమ్మను చూసేందుకు అందరిలాగే తాను కూడా ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నానని చెప్పుకొచ్చాడు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇలా వకీల్ సాబ్ సినిమా నిర్మాత అయినా కూడా ఓ కామన్ ఆడియెన్స్‌లా వచ్చి సినిమాను ఎంజాయ్ చేసిన దిల్ రాజుకు పవన్ అభిమానులు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.అటు వకీల్ సాబ్ చిత్రానికి అన్ని ఏరియాల నుండి పాజిటివ్ టాక్ వస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని మార్కెట్ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి.

ఈ సినిమాలో పవన్ సరసన అందాల భామ శృతి హాసన్ ఓ కేమియో రోల్‌లో నటిస్తుండగా, నివేదా థామస్, అంజలి, అనన్యాలు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.మరి వకీల్ సాబ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లు రాబడుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube