బాలయ్య సినిమాపై చాలా కోట్ల నమ్మకం పెట్టుకున్న దిల్‌ రాజు, ఎంత వరకు వర్కౌట్‌ అయ్యేను?

నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీనుల కాంబోలో రూపొందుతున్న సినిమా విడుదల తేదీ వచ్చేసింది.సింహా మరియు లెజెండ్‌ వంటి బ్లాక్ బస్టర్ ల తర్వాత వీరిద్దరి కాంబోలో రూపొందుతున్న సినిమా అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

 Dil Raju Eyes On Balakrishna And Boyapati Srinu Movie, Bala Krishna, Bb3 Movie,-TeluguStop.com

అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందనే నమ్మకంను ఇప్పటికే విడుదలైన పోస్టర్‌ లతో యూనిట్‌ సభ్యులు చెప్పకనే చెప్పారు.భారీ ఎత్తున అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ హాట్ కేక్స్‌ మాదిరిగా అమ్మడు పోయాయి.

దిల్‌ రాజు సినిమా రైట్స్ కోసం పోటీ పడుతున్నాడు అంటే ఖచ్చితంగా సినిమాలో మ్యాటర్ ఉంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.అందుకే ఈ సినిమాను నైజాం మరియు ఉత్తరాంధ్ర లో విడుదల చేసేందుకు హక్కులను దిల్‌ రాజు దక్కించుకోవడంతో అందరి దృష్టి ఈ సినిమాపై ఉంది.

ముఖ్యంగా ఈ సినిమా పై ఉన్న క్రేజ్ నేపథ్యంలో సినిమా విడుదలకు ముందే లాభాలను దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నైజాం మరియు ఉత్తరాంధ్ర లో దిల్ రాజు విడుదల చేసేందుకు సిద్దం అవుతున్న నేపథ్యంలో సీడెడ్‌ లో సాయి కొర్రపాటి విడుదల చేసేందుకు రైట్స్‌ ను కొనుగోలు చేయడం జరిగింది.

గుంటూరు లో ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి విడదుల చేసేందుకు రైట్స్ ను కొనుగోలు చేయడం జరిగింది.ఈ సినిమాలో హీరోయిన్స్ గా పూర్ణ మరియు ప్రగ్యా జైస్వాల్‌ లు కనిపించబోతున్నారు.

రికార్డ్‌ బ్రేకింగ్‌ వసూళ్లను ఈ సినిమా నమోదు చేస్తుందనే అభిప్రాయంతో హేమా హేమీలు ఈ సినిమా రైట్స్‌ ను కొనుగోలు చేయడం జరిగింది.కనుక ఈ సినిమా ఖచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసకుంటుందని నమ్మకంగా ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.బిబి3 మూవీగా ప్రచారం జరుగుతున్న ఈ సినిమా టైటిల్ ఏంటీ అనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.ఈ సినిమా కు మోనార్క్‌ తో పాటు చాలా పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

మరి ఏ టైటిల్ ఈ సినిమాకు యాప్ట్‌ అవ్వబోతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube