సమాన్యంగా అయితే పవన్ కళ్యాణ్ సినిమాతో పోటిపడడానికి ధైర్యం చేయడం చాలా కష్టం.మళ్లీ దిల్ రాజు లాంటి తెలివైన నిర్మాత లోతుగా ఆలోచించకుండా ఎటువంటి అడుగులు వేయరు.
తమిళంలో విజయ్ నటించిన తెరి హక్కులని, బాగా ఖర్చుపెట్టి కొనుక్కోని, ఏప్రిల్ 14న తెలుగు రాష్ట్రాలలో “పోలిసోడు” పేరుతో విడుదల చేస్తున్నాడు దిల్ రాజు.ఈ వార్త మొదటిసారి విన్నప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు.
సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి భారి సినిమాని పోటీలో పెట్టుకోని, దిల్ రాజు ఏంటి ఇలా పోటిలో డబ్బింగ్ సినిమాని దింపుతున్నాడు అని ముక్కున వేలేసుకున్నారు.కాని దిల్ రాజుకి ఉన్న పలుకుబడి, తెలివితేటల గురించి పూర్తిగా తెలియనివారే ఇలా అనుకొని ఉంటారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, సర్దార్ గబ్బర్ సింగ్ రిజల్ట్ దిల్ రాజుకి ముందే తెలుసు అంట.అందుకే ఏమాత్రం వెనుకడుగు వేయకుండా పొలీసోడు భారి విడుదలకి అంతా సిద్ధం చేసుకుంటున్నారు.
ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తే, సర్దార్ గబ్బర్ సింగ్ ప్రభావం వారం కన్నా ఎక్కువగా కనిపించే సూచనలు కనిపించట్లేదు.కాబట్టి పోలీసోడు కి వచ్చే ముప్పేమి ఉండదు.