నెక్స్ట్ ఇండస్ట్రీ పవన్ కళ్యాణ్ విజయ్ దేవరకొండనే.. దిల్ రాజు షాకింగ్ కామెంట్స్?

Dil Raju Compares Vijay Devarakonda With Pawan Kalyan At Rowdy Boys Preme Aakasam Song Launch

సినిమా ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ లలో ఒకరిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించే ఈ అద్భుతమైన విజయాలను అందుకున్న దిల్ రాజు ఇంటి నుంచి వెండితెరపైకి ఆశిష్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

 Dil Raju Compares Vijay Devarakonda With Pawan Kalyan At Rowdy Boys Preme Aakasam Song Launch-TeluguStop.com

ఈ క్రమంలోనే ఆశిష్ హీరోగా నటించిన రౌడీ బాయ్స్ అనే చిత్రాన్ని దిల్ రాజు పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కోసం దిల్ రాజు సపరేట్ ఈవెంట్ లను ఏర్పాటు చేసి రౌడీ బాయ్స్ చిత్రానికి ప్రమోషన్ చేస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం లోనే ప్రేమే ఆకాశం అనే పాటను విడుదల చేయడానికి ఒక సపరేట్ ఈవెంట్ ప్లాన్ చేశారు.ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన దిల్ రాజు వేదికపై మాట్లాడుతూ విజయ్ దేవరకొండ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

 Dil Raju Compares Vijay Devarakonda With Pawan Kalyan At Rowdy Boys Preme Aakasam Song Launch-నెక్స్ట్ ఇండస్ట్రీ పవన్ కళ్యాణ్ విజయ్ దేవరకొండనే.. దిల్ రాజు షాకింగ్ కామెంట్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ చిత్రానికి రౌడీ బాయ్స్ అనే టైటిల్ పెట్టడానికి విజయ్ దేవరకొండ పర్మిషన్ తీసుకున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా దిల్ రాజు తెలిపారు.ఈ సినిమా ఎక్కువగా కాలేజ్, ప్రేమ కథ నేపథ్యంలో తెరకెక్కడంతో ఈ సినిమాకు ఈ టైటిల్ ను పెట్టినట్లు తెలిపారు.

ఇక విజయ్ దేవరకొండతో తనకున్న జర్నీ గురించి ఈ సందర్భంగా మాట్లాడుతూ గీత గోవిందం సినిమా విడుదలైన తర్వాత సక్సెస్ వేడుకకు హాజరైనపుడు అక్కడికి విజయ్ దేవరకొండ రాగానే అభిమానులు చేసిన హంగామా చూసి నాకు పవన్ కళ్యాణ్ గుర్తుకు వచ్చారు.పవన్ కళ్యాణ్ కూడా నాలుగోవ సినిమాకు ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు.అలాంటి క్రేజ్ విజయ్ దేవరకొండ సంపాదించుకున్నారని తాను కూడా ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ అంత స్టార్ గా మారిపోతారని ఆ రోజే చెప్పినట్లు ఈ సందర్భంగా దిల్ రాజు తెలిపారు.నెక్స్ట్ ఇండస్ట్రీకి పవన్ కళ్యాణ్ అంటేనే విజయ్ దేవరకొండ అంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

అయితే ఇప్పటి వరకు వీరి కాంబోలో ఒక్క సినిమా కూడా రాలేదు.త్వరలోనే ఆ సమయం వస్తుందని ప్రస్తుతం విజయ్ దేవరకొండ లైగర్ పాన్ ఇండియా నటిస్తుండటంతో అతనికి ఆల్ ద బెస్ట్ చెప్పినట్లు తెలుస్తోంది.

#Preme Aakasam #Pawan Kalyan #Dil Raju #Rowedy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube