బింబిసారా సక్సెస్ పార్టీలో దిల్ రాజు.. సంతోషంలో డిస్ట్రిబ్యూటర్స్?

గత కొంతకాలం నుంచి వరుస సినిమాలు ఫ్లాప్ అవడంతో ఎంతో సతమతమవుతున్న నటుడు కళ్యాణ్ రామ్ తాజాగా టైం ట్రావెల్ చిత్రం బింబిసారా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 Dil Raju At Bimbisaras Success Party , Dil Raju ,bimbisara ,kalyan Ram ,ntr Arts-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈ సినిమా మొదటి షో నుంచి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతోంది.ఈ సినిమా విడుదలైన రెండు రోజులలోనే పెట్టుబడి మొత్తం రాబట్టింది.

ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ద్విపాత్రాభినయంలో నటించారు.కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే మొట్టమొదటిసారి ఇలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం, ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా కలెక్షన్లను కూడా రాబట్టి రెండు రోజులలోనే బ్రేక్ ఈవెన్ సాధించింది.

ఇలా ఈ సినిమా మంచి వసూలు రాబట్టడంతో నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Bimbisara, Bimbisaras, Dil Raju, Kalyan Ram, Ntr-Movie

ఇక ఈ సినిమా పెట్టుబడి మొత్తం రాబట్టడంతో చిత్ర బృందం సక్సెస్ పార్టీని నిర్వహించారు.ఈ సక్సెస్ పార్టీలో భాగంగా చిత్ర బృందంతో పాటు ప్రముఖ నిర్మాత దిల్ రాజు, సినిమా డిస్ట్రిబ్యూటర్లు కూడా పాల్గొన్నారు.ఇక నేటి నుంచి ఈ సినిమా రాబట్టే కలెక్షన్లన్నీ కూడా లాభాలు కావడంతో డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

డెబ్యూ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాని కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు.ఇక ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube