కరోనా బారిన పడ్ద దిల్ రాజు.. ?

ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన వకీల్ సాబ్ మూవీ సక్సెస్‌ను అందుకుని విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న విషయం తెలిసిందే.కాగా ఈ సినిమా ప్రమోషన్స్ కోసమని దిల్ రాజు ఎక్కువగా బయటే తిరుగుతున్న విషయం తెలిసిందే.

 Dil Raju Affected By Corona-TeluguStop.com

ఈ క్రమంలో డిస్ట్రిబ్యూటర్లతో మీట్ అయ్యాడు.ఆడియన్స్‌ను కలిసాడు.

దాంతో పాటు ప్రమెషన్స్ కోసం థియేటర్స్ కూడా తిరిగాడు.

 Dil Raju Affected By Corona-కరోనా బారిన పడ్ద దిల్ రాజు.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇంతవరకు బాగానే ఉన్నా ఈయన జోష్ చూసి కరోనా ముచ్చటపడింది కావచ్చూ అందుకే కరోనా వైరస్, దిల్ రాజును చేరింది.

ప్రస్తుతం దిల్ రాజుకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది.ఇకపోతే పవన్ కళ్యాణ్‌తో సినిమా నిర్మించాలన్న తన 22 ఏళ్ళ కలను నెరవేర్చుకున్న ఆనందంలో ప్రమోషన్స్ ఓ రేంజ్‌లో చేసాడు దిల్ రాజు.

ఈ నేపధ్యంలో ఎందరినో కలిసాడు.ఇదిలా ఉండగా తనకు పాజిటివ్ వచ్చిందనే విషయం తెలిసిన వెంటనే హోమ్ ఐసోలేషన్‌కు వెళ్లిపోయాడు.

అయితే తనను కలిసిన వారంతా వెంటనే టెస్టులు చేయించుకోవాలని పేర్కొంటున్నాడు.

ఇక గత కొద్దిరోజులుగా దిల్ రాజును దర్శకుడు శ్రీరామ్ వేణు అంటిపెట్టుకునే ఉన్నాడు.

అంతేకాదు వకీల్ సాబ్ సక్సెస్ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కూడా రెండు రోజుల కిందే దిల్ రాజు, శ్రీరామ్ వేణులను సత్కరించాడు.దీంతో ప్రస్తుతం వీరికి కూడా కోవిడ్ భయం పట్టుకుందని సామాచారం.

#Affected By #Dil Raju #Chiranjeevi #Corona Positive

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు