చరణ్‌, బన్నీల సినిమాలపై మరింత స్పష్టత ఇచ్చిన దిల్‌ రాజు

టైటిల్‌ చూసి వీరిద్దరి కాంబో సినిమా దిల్‌ రాజు ఏం చేస్తున్నాడా అంటూ ఆశ్చర్యపోయారా.దిల్‌ రాజు స్పష్టతను ఇచ్చింది ఈ ఇద్దరు హీరోల వేరు వేరు సినిమాల గురించి.

 Dil Raju About Ram Charan And Allu Arjun Films-TeluguStop.com

ఆ వివరాలు ఏంటో చూద్దాం రండీ.వకీల్‌ సాబ్‌ విడుదల సందర్బంగా నిర్మాత దిల్‌ రాజు మీడియాతో మాట్లాడాడు.

ఈ సందర్బంగా ఆయన పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించాడు.వకీల్‌ సాబ్‌ సినిమా గురించి మాత్రమే కాకుండా ఆయన బ్యానర్‌ లో రాబోతున్న ఇతర సినిమాల గురించి కూడా క్లారిటీ ఇచ్చాడు.

 Dil Raju About Ram Charan And Allu Arjun Films-చరణ్‌, బన్నీల సినిమాలపై మరింత స్పష్టత ఇచ్చిన దిల్‌ రాజు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ముఖ్యంగా రామ్‌ చరణ్‌ మరియు శంకర్‌ ల కాంబోలో రాబోతున్న సినిమాల గురించి ఆయన స్పందించాడు.సినిమా ను జూన్‌ లేదా జులైలో పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు.

రామ్‌ చరణ్‌ మరియు శంకర్‌ ల మూవీ తమ బ్యానర్‌ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిలుస్తుందని ఈ సందర్బంగా ఆయన అన్నాడు.ఇక అల్లు అర్జున్‌ తో సినిమా ఉందా లేదా అంటూ మీడియా వారు ప్రశ్నించగా తప్పకుండా బన్నీ హీరోగా మా బ్యానర్‌ లో ఐకాన్‌ సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు.

వేణు శ్రీరామ్‌ ఆ కథకు దర్శకత్వం వహించబోతున్నట్లుగా కూడా చెప్పుకొచ్చాడు.ఐకాన్‌ సినిమా మూడు సంవత్సరాల క్రితం ప్రకటించినా కూడా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది.

ఎట్టకేలకు సినిమా గురించి దిల్‌ రాజు స్పందించడంతో సినిమా ఉందని తేలిపోయింది.అయితే వకీల్‌ సాబ్‌ సక్సెస్‌ అయితేనే బన్నీ నుండి వేణు శ్రీరామ్‌ కు పిలుపు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

ఆ విషయంలో మరో రెండు రోజుల్లో మరింత స్పష్టత రావడం ఖాయం. ఇక వకీల్‌ సాబ్‌ సినిమా గురించి దిల్‌ రాజు మాట్లాడుతూ మరో లెవల్‌ లో సినిమా ఉంటుందని నమ్మకం వ్యక్తం చేశాడు.

#Shankar #CharanWith #AlluArjun #VakeelSaab #Dil Raju

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు