దుమ్ము లేపిన సుశాంత్ కొత్త సినిమా ట్రైలర్… బాహుబలిని క్రాస్ చేసింది  

Sushant last film Dil Bechara trailer is the most liked, Bollywood, Hollywood, South cinema, Indian cinema, Hot Star - Telugu Bollywood, Hollywood, Hot Star, Indian Cinema, South Cinema, Sushant Last Film Dil Bechara Trailer Is The Most Liked

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.అతనికి సోషల్ మీడియాలో అభిమానులు కూడా విపరీతంగా పెరిగిపోయారు.

 Dil Bechara Trailer Bahubali

అతని కోసం బాలీవుడ్ లో వారసత్వ సినిమాలని బహిష్కరిస్తామని సోషల్ మీడియాలో కాంపైన్ చేస్తున్నారు.ఇక సల్మాన్, కరణ్ జోహార్, అలియా భట్ లాంటి నటులకి సుశాంత్ మరణం తర్వాత సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తుంది.

ఇదిలా ఉంటే సుశాంత్ చివరిగా నటించిన సినిమా దిల్ బచేరా సినిమాని ముఖేష్ చాబ్రా దర్శకత్వంలో నటించారు.ఫాక్స్ స్టార్ స్టూడియో ఈ సినిమాని నిర్మించింది.

దుమ్ము లేపిన సుశాంత్ కొత్త సినిమా ట్రైలర్… బాహుబలిని క్రాస్ చేసింది-Movie-Telugu Tollywood Photo Image

డిస్నీ హాట్ స్టార్ లో ఈ సినిమాని ఈ నెల 24ల రిలీజ్ చేయబోతున్నారు.

ఇక ఈ సినిమాని ప్రేక్షకులకి ఫ్రీగా అందిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా ట్రైలర్ ని డిస్నీ హాట్ స్టార్ తాజాగా రిలీజ్ చేసింది.అయితే ఈ ట్రైలర్ కి ఊహించిన దానికంటే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఇప్పటి వరకు బాలీవుడ్ లో ఏ సినిమాకి రాని స్థాయిలో ఈ సినిమా ట్రైలర్ వ్యూస్ వచ్చాయి.కేవలం రెండు రోజుల వ్యవధిలోనే దిల్ బచేరా ట్రైలర్ ని రెండు కోట్ల మందికి పైగా వీక్షించారు.

ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో బాహుబలి 2 ట్రైలర్ కి మాత్రమే అత్యధిక వ్యూస్ వచ్చాయి.అయితే బాహుబలిని సుశాంత్ చివరి సినిమా ట్రైలర్ కేవలం రెండు రోజుల్లోనే క్రాస్ చేయడం విశేషం.

ఇక ఈ సినిమాకి కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉండటంతో కచ్చితంగా సక్సెస్ అవుతుందనే నమ్మకంతో దర్శక, నిర్మాతలు ఉన్నారు.

#Hot Star #Hollywood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Dil Bechara Trailer Bahubali Related Telugu News,Photos/Pics,Images..