మోడీ, అమిత్ షా ల పై సంచలన కామెంట్స్ చేసిన దిగ్విజయ్ సింగ్..!!

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ప్రధాని మోడీ అదే రీతిలో అమిత్ షా పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో పెగాసస్ స్పైవేర్ వ్యవహారం రాజకీయ దుమారాన్ని లేపుతున్న సంగతి తెలిసిందే.

 Digvijay Singh Makes Sensational Comments On Modi Amit Shah-TeluguStop.com

దీనిపై చర్చ చేపట్టాలని విపక్షాలు ఉభయ సభలలో పట్టుబడుతున్నాయి.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ.

కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.పార్లమెంటులో పెగాసస్ స్పైవేర్ వ్యవహారం పై చర్చకు మోడీ, అమిత్ షా ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.

 Digvijay Singh Makes Sensational Comments On Modi Amit Shah-మోడీ, అమిత్ షా లపై సంచలన కామెంట్స్ చేసిన దిగ్విజయ్ సింగ్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నిఘా వ్యవస్థను అంతర్గత భద్రత అదే రీతిలో మాదకద్రవ్యాల వంటి వాటిపై ఉపయోగిస్తే పర్వాలేదు గానీ ఈ విధంగా రాజకీయాలు చేయడానికి ప్రభుత్వం ఉపయోగించటం దారుణమని అన్నారు.అంత మాత్రమే కాక దేశంలో సమాచారం ఇతరులకు చేరే అవకాశం ఉందని గతంలోనే 2019 సంవత్సరంలో ఈ వ్యవహారంపై సభలో తాను అనేక ప్రశ్నలు వేయడం జరిగింది అని అప్పటి ఐటీ శాఖ మంత్రి నుండి ఎటువంటి స్పందన లేదని సోషల్ మీడియాలో దిగ్విజయ్ పేర్కొన్నారు.

ఎట్టి పరిస్థితుల్లో పెగాసస్ స్పైవేర్ పై చర్చ జరపాలని ఇప్పటికే నోటీసు ఇవ్వటం జరిగిందని మరి మోడీ అమిత్షా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు.దీనిపై చర్చకు ఇజ్రాయిల్ దేశం ఇప్పటికే రెడీ అయ్యిందని మరి అలాంటి సమయంలో మోడీ అమిత్ షా ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని దేశ భద్రతపై నమ్మకం లేదా అంటూ దిగ్విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

#Digvijay Singh #Modi #Pegasus Spyware #Security #Comments

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు