వాట్సాప్ వీడియో కాల్స్‌లో డిజిటల్ అవతార్స్‌.. యూజర్లకు పండగే!

వాట్సాప్.గతంలో కేవలం మెసేజెస్ పంపించేందుకు మాత్రమే ఉపయోగపడేది.ఆ తర్వాత వాయిస్ కాల్స్ అందుబాటులోకి వచ్చాయి.ఆపై వీడియో కాల్స్‌ ఫీచర్ లాంచ్ అయ్యింది.అలా క్రమక్రమంగా మోస్ట్ అడ్వాన్స్‌గా మెసేజింగ్ యాప్‌గా వాట్సాప్ మారిపోయింది.కమ్యూనికేషన్ విషయంలో మరే ఇతర అప్లికేషన్‌పై ఆధారపడకుండా వాట్సాప్ అన్ని ఫీచర్లను ఆఫర్ చేస్తోంది.

 Digital Avatars In Whatsapp Video Calls For Users , Whatsapp, Messages, Video C-TeluguStop.com

అయితే ఫీచర్లతో పాటు కొంత ఫన్ కూడా అందించాలని వాట్సాప్ భావిస్తోంది.అందులో భాగంగా ఇప్పటికే ఓన్ స్టిక్కర్స్, ఎమోజీలు, ఎమోజీలు రియాక్షన్లు పరిచయం చేసింది.

తాజాగా మరొక అద్భుతమైన ఫీచర్ తీసుకొచ్చేందుకు కూడా వాట్సాప్ సిద్ధమైంది.అదే డిజిటల్ అవతార్స్.

డిజిటల్ అవతార్స్‌ గురించి మీకు తెలిసే ఉంటుంది.నిజమైన వ్యక్తిని పోలిన డిజిటల్ ఇమేజ్‌నే డిజిటల్ అవుతార్‌ అని పిలవవచ్చు.కార్టూన్స్ లాగా ఈ అవతార్స్ ఉంటాయి.ఇంటర్నెట్‌లో మెమోజీ, బిట్‌మోజీ వంటి ఎన్నో డిజిటల్ అవతార్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి.

మీ వద్ద ఐఫోన్ ఉన్నట్లయితే మెమోజీ ఎలా వర్క్ అవుతుందనే దానిపై మీకు ఒక ఐడియా ఉండే ఉంటుంది.ఇందులో ఫోన్ కెమెరా ఓపెన్ చేసి మెమోజీ సెలెక్ట్ చేసుకోగానే మన ఫేస్ కి బదులుగా ఒక ఫన్నీ ఫేస్ కనిపిస్తుంటుంది.

మన ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్‌కి తగ్గట్టుగా ఈ ఫన్నీ కార్టూన్ ఫేస్ కూడా కదులుతూ ఉంటుంది.అయితే వాట్సాప్ వీడియో కాల్స్‌లో కూడా ఇలాంటి ఒక డిజిటల్ అవతార్ అందించేలా మెసేజింగ్ యాప్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

వాట్సాప్ మెమోజీ లాగా యానిమేటెడ్ అవతార్స్ తీసుకువస్తుందా లేక ఎటూ కదలని 2డీ రూపంలో అవతార్స్ తీసుకు వస్తుందా అనేది తెలియాల్సి ఉంది.ప్రస్తుతం మనం వాట్సాప్ వీడియో కాల్ చేస్తే అందులో మన ఫేస్ కనపడకుండా ఉండకూడదు అనుకుంటే కెమెరా సింపుల్‌గా టర్న్ ఆఫ్ చేస్తాం.

అప్పుడు వీడియో కాల్ ఇంటర్‌ఫేస్ లో మన ప్రొఫైల్ ఫొటో అవతలి వ్యక్తికి కనిపిస్తుంది.కానీ కొత్త డిజిటల్ అవతార్ అందుబాటులోకి వస్తే ప్రొఫైల్ ఫొటోకి బదులుగా మన డిజిటల్ అవుతార్‌ కనిపిస్తుంది.

వీడియో కాల్స్‌లో ప్రైవసీ కోరుకునే వారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది.

Telugu Avathars, Messages, Whatsapp-Latest News - Telugu

ఈ ఫీచర్‌కు సంబంధించిన వివరాలను వాట్సాప్ బీటా ఇన్ఫో వెల్లడించింది.ఒక స్క్రీన్‌షాట్ కూడా షేర్ చేసింది.ఈ స్క్రీన్‌షాట్‌లో వీడియో కాల్ ఇంటర్‌ఫేస్ కింద “స్విచ్ టు అవతార్ (Switch To Avatar)” అనే బటన్ కనిపించింది.

అంతకుమించి ఎలాంటి వివరాలు తెలపలేదు.ఎందుకంటే ఇది ప్రస్తుతానికి ప్రయోగ దశలోనే ఉంది త్వరలో బీటా టెస్టర్లకు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

ఈ అవతార్స్ అందుబాటులోకి వస్తే వీడియో కాల్స్ మరింత ఫన్‌గా మారుతాయి.అప్పుడు వివరాలకు పండుగ అని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube